ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేను రైతు బిడ్డనే... రైతువైపే ఉంటా : యడియూరప్ప

ABN, First Publish Date - 2020-09-28T20:18:43+05:30

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించారు. రైతు సంఘాలు, కాంగ్రెస్, జేడీఎస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించారు. రైతు సంఘాలు, కాంగ్రెస్, జేడీఎస్ ఈ బంద్‌కు మద్దతిచ్చాయి. అయితే ఈ బంద్‌ను ‘రాజకీయ బంద్’ గా సీఎం యడియూరప్ప అభివర్ణించారు. రైతుల పంట అని, వారు దేశంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ఉందని తెలిపారు. మార్కెట్ కమిటీలకు తామేమీ మంగళం పాడలేదని, రైతులు పంటలను అక్కడ కూడా అమ్ముకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. లేదంటే రైతులకు ఎక్కడ అధిక ధర వస్తే అక్కడ అమ్ముకోవచ్చని తెలిపారు.


రైతులందరూ ఓ ఆర్నెళ్ల పాటు వేచి చూడాలని, మోదీ తీసుకొచ్చిన కొత్త బిల్లులు వారికెలా ఉపయోగపడతాయో అప్పుడు తెలుస్తుందని ఆయన కోరారు. ఓ రైతు బిడ్డగా తాను రైతుల పక్షపాతినేనని, అందరితో సుదీర్ఘంగా సంప్రదించిన తర్వాతే కేంద్రం ఈ బిల్లులను తెచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఈ బిల్లులపై సచివాలయంలో రైతు సంఘాలతో ఓ సమావేశం జరిగిందని, అప్పుడు సవరణపై చర్చించడానికి వారు ఏమాత్రం ఆసక్తిని చూపలేదన్నారు.

Updated Date - 2020-09-28T20:18:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising