మాస్క్ ఫ్రీ నగరంగా బీజింగ్!
ABN, First Publish Date - 2020-08-22T08:05:02+05:30
బీజింగ్, ఆగస్టు 21: కరోనా పుట్టినిల్లు చైనాలో వైరస్ పూర్తిగా కంట్రోల్ అయినట్టు కనిపిస్తోంది.
బీజింగ్, ఆగస్టు 21: కరోనా పుట్టినిల్లు చైనాలో వైరస్ పూర్తిగా కంట్రోల్ అయినట్టు కనిపిస్తోంది. ఐదు రోజులుగా ఈ దేశంలో స్థానికంగా వ్యాపించిన ఒక్క కేసు కూడా బయటపడలేదు. చైనా రాజధాని బీజింగ్‌తోపాటు ఇటీవల కేసులు ఎక్కువగా నమోదైన షిన్‌జియాంగ్.. ఇతర ప్రాంతాల్లో వైర్‌సను విజయవంతంగా కట్టడి చేశారు. బీజింగ్‌లో అయితే 13 రోజులుగా ఒక్క కేసు కూడా బటయపడలేదు. దీంతో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించాలన్న నిబంధనను ఎత్తివేస్తున్నట్టు బీజింగ్ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
Updated Date - 2020-08-22T08:05:02+05:30 IST