ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నిరోధక నిధి కోసం భిక్షగాడి దాతృత్వం..

ABN, First Publish Date - 2020-08-12T15:21:50+05:30

కరోనా నిరోధక నిధి కోసం భిక్షగాడి దాతృత్వం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా నిరోధక నిధికి ఎనిమిదోసారి రూ.10వేలు అందజేత

చెన్నై: తమిళనాడులో కరోనా నిరోధక నిధికి వరుసగా ఎనిమిదో సారి తనవంతు విరాళం ఇచ్చి ఓ భిక్షగాడు తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. ఇప్పటివరకు ఆయన రూ.80 వేలను కరోనా నిరోధక నిధికి అందజేశాడు. తూత్తుకుడి జిల్లా ఆలంగుడికి చెందిన పూల్‌పాండియన్‌ (65) వివాహమైన కొద్దిరోజుల్లోనే కుటుంబాన్ని వదిలేసి ముంబైకి వెళ్లాడు. అక్కడ ఉద్యోగం లభించకపోవడంతో భిక్షాటన చేసి జీవించేవాడు. ముంబై నుంచి ఆయన ఇంటికి రాగా, కుటుంబసభ్యులు ఇంట్లోకి రానీయలేదు. అనంతరం భిక్షాటన చేస్తూ పొట్ట పోసుకుంటున్న ఆయన తన ఖర్చులకు పోగా మిగిలిన నగదుతో కుర్చీలు, బెంచీలు సహా పలు పరికరాలకు కొనుగోలు చేసి పాఠశాలలకు అందిస్తుంటాడు. ఆయన గత మే నుంచి భిక్షాటన చేసి వచ్చిన తలా రూ.10 వేల చొప్పున ఏడుసార్లు కరోనా నివారణ నిధికి అంద జేశాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఎనిమిదోసారి మరో రూ.10 వేలను కలెక్టర్‌ వినయ్‌కు అందజేశాడు. ఆయన దాతృత్వాన్ని మెచ్చిన పలువురు అభినందించారు.  

Updated Date - 2020-08-12T15:21:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising