ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర హోంశాఖ ఫేస్‌బుక్‌లో ప్రత్యక్షమైన బీర్ బాటిళ్లు, మిక్సర్

ABN, First Publish Date - 2020-05-28T21:20:05+05:30

కేంద్ర హోంశాఖ ఫేస్‌బుక్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. రెండు బీర్ బాటిళ్లు, మిక్సర్ తో ఉన్న ఫోటోను గురువారం పోస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ ఫేస్‌బుక్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. రెండు బీర్ బాటిళ్లు, మిక్సర్ తో ఉన్న ఫోటోను గురువారం పోస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న బెంగాల్‌లో సహాయక చర్యలపై ఓ పోస్ట్‌లో ఈ ఫోటో పెట్టారు. ‘‘ప్రతి ఒక్కరూ విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే రుజువు’’ అని ఫేస్‌బుక్ యూజర్ పేర్కొన్నారు. అయితే ఈ పోస్ట్ చాలా మందికి రుచించలేదు. ఈ పోస్ట్‌పై కొందరు కామెంట్లు కూడా చేశారు.


‘‘వెంటనే ఈ ఫోటోను తీసేయండి’’ అని ఒకరు కామెంట్ పెడితే.... మరొకరు ‘‘ఏందిది? దీనికి బాధ్యులెవరు? కఠిన చర్యలు తీసుకోవాల్సిందే’’ అని మరొకరు పోస్ట్ చేశారు. అయితే దీనిపై కేంద్ర హోంశాఖ స్పందించింది. ఈ పేజీని ఓ జూనియర్ ఉద్యోగి చూస్తారని, ఇది అనుకోకుండా జరిగిన పొరపాటు అని, పర్సనల్ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేయబోయి, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేజీలో పోస్ట్ చేయడం మూలానే ఇలా జరిగిందని వివరణ ఇచ్చింది.


ఈ పోస్టును 9:32 నిమిషాలకు తొలగించామని, సదురు ఉద్యోగి క్షమాపణలు కూడా చెప్పారని, లిఖిత పూర్వకంగా రాసిచ్చారని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఈ పోస్టు హోంశాఖ వెబ్‌సైట్‌లో 15 నిమిషాలు పాటు ఉంది. అయితే... హోంశాఖ మాత్రం సదురు ఉద్యోగిపై కాస్తంత సానుభూతితో ఉన్నట్లు సమాచారం. అనుకోకుండా జరిగిపోయిన పొరపాటు అని, ఉద్యోగి నిజాయితీతోనే ఒప్పుకున్నారు కాబట్టే సానుభూతితో ఉన్నట్లు సమాచారం. 

Updated Date - 2020-05-28T21:20:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising