ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చర్చల సమయంలో చైనాతో జాగ్రత్త : రాజ్‌నాథ్ సూచన

ABN, First Publish Date - 2020-10-28T22:10:44+05:30

చైనా, భారత్ మధ్య నడుస్తున్న చర్చల విషయంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ అధికారులకు బుధవారం ఓ కీలకమైన సూచన చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : చైనా, భారత్ మధ్య నడుస్తున్న చర్చల విషయంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ అధికారులకు బుధవారం ఓ కీలకమైన సూచన చేశారు.  చర్చించే సమయంలో చైనా అధికారులతో అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు. చైనాతో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో రాజ్‌నాథ్ ఆర్మీ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చర్చలు జరిపే సమయంలో అత్యంత నిజాయితీగా వ్యవహరించాలని, అత్యంత నమ్మకమైన వాతావరణంలో ఆ చర్చలు జరగాలని  పేర్కొన్నారు. చైనా నమ్మకంతో వ్యవహరించడం లేదని, వారి ఉద్దేశం కూడా అస్పష్టంగా, ప్రశ్నార్థకంగానే ఉందని ఆర్మీ అధికారులతో రాజ్‌నాథ్ అన్నట్లు సమాచారం. చైనాతో ఘర్షణ ఏర్పడిన సమయంలో భారత జవాన్లు స్పందించిన తీరు అద్భుతంగా ఉందని, అలాగే చలి కాలంలోనూ అంతే తెగువ చూపిస్తూ సైన్యం విధులు నిర్వర్తిస్తోందని రాజ్‌నాథ్ ప్రశంసించారు.

Updated Date - 2020-10-28T22:10:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising