ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్-19: బెంగళూరులో రెండు ప్రాంతాలు మూసివేత

ABN, First Publish Date - 2020-04-10T23:15:50+05:30

బెంగళూరులో కొత్తగా మరో ఐదుగురు కోవిడ్-19 బారిన పడిన నేపథ్యంలో బృహత్ బెంగళూరు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: బెంగళూరులో కొత్తగా మరో ఐదుగురు కోవిడ్-19 బారిన పడిన నేపథ్యంలో బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. బాపూజీ నగర్ వార్డ్-134, పాదరాయణపుర వార్డ్-135లను పూర్తిగా మూసివేయాలని ఆదేశించింది. తాజాగా మరో ఐదు కోవిడ్-19 కేసులు నమోదైన నేపథ్యంలో ఈ మహమ్మారిని అరికట్టేందుకే ఈ మేరకు నిర్ణయించినట్టు బీబీఎంపీ కమిషనర్ అనిల్ కుమార్ వెల్లడించారు. ‘‘తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి. ఇకపై నిత్యవసర సరుకులన్నీ ఇళ్ల వద్దకే సరఫరా చేయాలని బీబీఎంపీ యోచిస్తోంది. అన్ని వాహనాలపైనా నిషేధం కొనసాగుతుంది..’’ అని ఆయన పేర్కొన్నారు. బాపూజీ నగర్ నుంచి ముగ్గురు, పాదరాయణపుర నుంచి ఇద్దరికి కరోనా సోకినట్టు కమిషనర్ వెల్లడించారు.


కాగా కర్నాటకలో ఇవాళ పది కరోనా కేసులు నమోదయ్యాయనీ.. వీటితో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్-19  కేసుల సంఖ్య 207కు చేరిందని ప్రభుత్వం వెల్లడించింది. 30 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఆరుగురు చనిపోయారు. 

Updated Date - 2020-04-10T23:15:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising