ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వందలాదిమంది రోహింగ్యాలను క్వారంటైన్ చేసిన బంగ్లాదేశ్

ABN, First Publish Date - 2020-05-10T00:45:42+05:30

బోటులో బంగాళాఖాతంలో చిక్కకున్న 280 ముస్లిం మెజారిటీ రోహింగ్యాలను బంగ్లాదేశ్ నేవీ రక్షించింది. కరోనా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢాకా: చెక్క బోటులో బంగాళాఖాతంలో చిక్కుకున్న 280 ముస్లిం మెజారిటీ రోహింగ్యాలను బంగ్లాదేశ్ నేవీ రక్షించింది. కరోనా వైరస్ భయం నేపథ్యంలో వారందరినీ ఓ దీవిలో క్వారంటైన్ చేయనున్నట్టు నేవీ అధికారులు తెలిపారు. అయితే, వరద తాకిడి ఎక్కువగా ఉండే భాసన్ చార్ దీవికి రోహింగ్యాలను తరలించడాన్ని హక్కుల సంఘాలు, సహాయ సంస్థలు తప్పుబడుతున్నాయి. బంగ్లాదేశ్ చర్యను ఖండిస్తున్నాయి. 


బలహీనమైన చెక్క పడవలో ప్రయాణిస్తున్న రోహింగ్యాలు గురువారం బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించారు. గుర్తించిన బంగ్లాదేశ్ నేవీ వారిని రక్షించి దక్షిణ తీరంలోని లోతట్టు ద్వీపానికి తరలించింది. ప్రభుత్వం అక్కడ ఇళ్లు, తుపాను షెల్టర్లు నిర్మిస్తోంది. రోహింగ్యాలు చాలా ఆకలితో ఉండడంతో వారికి ఆహారం, నీళ్లు అందించినట్టు నేవీ అధికారి ఒకరు తెలిపారు. వారిని 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచాలని నిర్ణయించామని, ఆ తర్వాత ఏం చేయాలనే విషయాన్ని ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు.  

Updated Date - 2020-05-10T00:45:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising