ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగ్లా జాతిపిత హత్య కేసులో మాజీ సైనిక కెప్టెన్ ఉరితీత

ABN, First Publish Date - 2020-04-12T15:46:11+05:30

బంగ్లాదేశ్ మాజీ సైనిక కెప్టెన్ అబ్దుల్ మాజిద్‌ను బంగ్లా ప్రభుత్వం శనివారం అర్ధరాత్రి ఉరితీసింది. 1975 బంగ్లాదేశ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ మాజీ సైనిక కెప్టెన్ అబ్దుల్ మాజిద్‌ను బంగ్లా ప్రభుత్వం శనివారం అర్ధరాత్రి ఉరితీసింది. 1975 బంగ్లాదేశ్ తిరుగుబాటులో ప్రమేయం ఉందని బంగ్లాదేశ్ జాతిపిత, ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్ హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా తండ్రి, ఆయన కుటుంబ సభ్యులు 1975 ఆగస్టు 15 న హత్యకు గురయ్యారు.


ఈ సంఘటన జరిగి దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత మాజీ కెప్టెన్ అబ్దుల్ మాజీద్‌ను శనివారం అర్ధరాత్రి అక్కడి ప్రభుత్వం ఉరి తీసింది. 1998 లో ఈ హత్యలో ఈయనతో పాటు మరో 12 మందికి ప్రమేయముందని బంగ్లా సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అయితే ఆ సమయంలో ఈ అధికారి పరారీలో ఉన్నారు. 1996 నుంచి మజేద్ భారతదేశానికి వచ్చారని కొందరు భావిస్తున్నారు.


గత నెలలో ఆయన తిరిగి స్వదేశమైన బంగ్లాకు వెళ్లిపోయాడు. అయితే వారం రోజుల క్రితం ఓ రిక్షాలో ప్రయాణిస్తుండగా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ బంగ్లా అధ్యక్షుడు ఆయన వేడుకున్నారు. అయితే నేర తీవ్రతను పరిగణనలోకి తీసుకొన్న అధ్యక్షుడు క్షమాభిక్షను తిరస్కరించారు. ‘‘దేశంలోనే అతిపెద్ద జైలుగా పరిగణింపబడుతున్న ఢాకాలోని జైలులో మాజీద్‌ను శనివారం అర్ధరాత్రి 12.01 గంటలకు ఉరితీశాము’’ అని బంగ్లా న్యాయశాఖా మంత్రి అనిసుల్ హక్ ప్రకటించారు. 


Updated Date - 2020-04-12T15:46:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising