ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తబ్లీగీ జమాత్‌ కార్యకలాపాలన్నింటినీ నిషేధించండి.. సుప్రీంకోర్టులో పిటీషన్

ABN, First Publish Date - 2020-04-08T00:52:13+05:30

తబ్లీగీ జమాత్ కార్యకలాపాలన్నిటీనీ పూర్తిగా నిషేధించాలంటూ సూప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఎంసీడీ చట్టంలోని ప్రొవిజన్ల ప్రకారం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తబ్లీగీ జమాత్ కార్యకలాపాలన్నిటీనీ పూర్తిగా నిషేధించాలంటూ సూప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఎంసీడీ చట్టంలోని ప్రొవిజన్ల ప్రకారం తబ్లీగీ జమాత్ కార్యకలాపాలను నిషేధించే విధంగా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని, అలాగే ఆ సంస్థకు చెందిన భవనాన్ని కూడా కూల్చేయాలని కోరుతూ అజయ్ గౌతం అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డేకు ఓ లేఖ ద్వారా తన పిటిషన్‌ను గౌతం పంపారు. తబ్లీగీ జమాత్ మత ప్రార్థనల పేరుతో దేశంలో కరోనా ప్రబలేలా చేసిన కుట్రదారులపై సీబీఐ దర్యాప్తు జరపాలని పిటిషనర్ కోరారు. అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం మార్చి 12, 16 తేదీల్లో ప్రత్యేక ఆదేశాలను వెలువరించిందని, అయితే వీటిని అమలు చేయడంలో విఫలమైన పోలీసులు, రాజకీయ నేతలపైనా కఠిన చర్యలు తీసుకోవాలని అజయ్ గౌతం సుప్రీం కోర్టును అభ్యర్థించారు. 


ఇదిలా ఉంటే ఇప్పటివరకు దేశంలో నమోదైన 4,421 కరోనా పాజిటివ్ కేసుల్లో 1000మందికి పైగా తబ్లీగీ జమాత్ కార్యక్రమానికి హాజరైనవారు లేదా వారికి సన్నిహితంగా మెలిగినవారే. వీరందరినీ ప్రభుత్వం క్వారంటైన్ చేసింది.

Updated Date - 2020-04-08T00:52:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising