ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆత్మనిర్భర్’లో భాగమవుతాం : బంగ్లాదేశ్ దౌత్యవేత్త

ABN, First Publish Date - 2020-08-16T03:31:59+05:30

భారత దేశం ‘ఆత్మనిర్భర్’ అవుతోందని, ఈ పథకంలో తాము కూడా భాగమవుతామని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : భారత దేశం ‘ఆత్మనిర్భర్’ అవుతోందని, ఈ పథకంలో తాము కూడా భాగమవుతామని న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషనర్ మొహమ్మద్ ఇమ్రాన్ శనివారం చెప్పారు. 


ఇమ్రాన్ మాట్లాడుతూ, తాను శనివారం ఉదయం ఎర్రకోట వద్ద భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవాల్లో పాల్గొన్నానని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం తనకు చాలా ప్రోత్సాహకరంగా ఉందని చెప్పారు. భారత దేశంతో మరింత మెరుగైన సంబంధాల కోసం తాము ఎదురు చూస్తున్నామన్నారు. భారత దేశంతో ఇప్పటికే తమకు సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఈ సత్సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళ వచ్చునని తెలిపారు. 


‘ఆత్మనిర్భర్’ (స్వయం సమృద్ధం) అవడానికి సంబంధించి భారత దేశం, బంగ్లాదేశ్ పరస్పరం సహకరించుకోగలవని తెలిపారు. వ్యక్తిగత స్థాయిలోనైనా, జాతీయ స్థాయిలోనైనా ప్రతి ఒక్కరూ స్వయం సమృద్ధం కావాలన్నారు. భారత దేశం ‘ఆత్మనిర్భర్’ అవుతుండటంతో, తాము కూడా దానిలో భాగస్థులం కావాలనుకుంటున్నామని చెప్పారు. ఇరు దేశాలు కలిసి పని చేస్తే, అభివృద్ధి సాధించవచ్చునని తెలిపారు. 


Updated Date - 2020-08-16T03:31:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising