ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం ఉండాల్సిందే : నాగా గ్రూప్

ABN, First Publish Date - 2020-09-19T16:42:46+05:30

ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం వస్తేనే నాగా ఉద్యమానికి గౌరవ ప్రదమైన ముగింపు ఉంటుందని, దాని కోసం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గౌహతి : ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం వస్తేనే నాగా ఉద్యమానికి గౌరవ ప్రదమైన ముగింపు ఉంటుందని, దాని కోసం పోరాడతామని నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఎన్‌ఎస్‌సీఎన్) స్పష్టం చేసింది. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ జాతీయ కార్యవర్గ సమావేశం నాగాలాండ్ లోని దిమాపూర్ లో జరిగింది.


ఈ సమావేశంలో ‘‘ఇండో -నాగా చర్చలు, నాగాలాండ్ ఉద్యమం గురించి చర్చించినట్లు ప్రతినిధులు పేర్కొన్నారు. ‘‘నాగా ఒప్పందం, ఉద్యమానికి గౌరవ ప్రదమైన ముగింపు ఉండాలంటే ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం కావాలి. ఈ మేరకు ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆ తీర్మానాన్ని ఆమోదించింది కూడా’’ అని సంస్థ పేర్కొంది. ఆగస్టు 3, 2015 లో జరిగిన చారిత్రక ముసాయిదా ఆధారంగా  తుది ఒప్పందానికి కూడా రావాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. 

Updated Date - 2020-09-19T16:42:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising