ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాకిస్తాన్‌పై అయోధ్య పెద్దల ఫైర్.. అవసరమైతే అక్కడ కూడా రామాలయం కడతామంటూ...

ABN, First Publish Date - 2020-05-28T23:14:45+05:30

కొవిడ్-19 మధ్య కూడా రామ మందిరాన్ని నిర్మిస్తున్నారంటూ పాకిస్తాన్ వ్యాఖ్యానించడంపై అయోధ్యలోని సాధువులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అయోధ్య: కొవిడ్-19 సంక్షోభంలో కూడా రామ మందిరాన్ని నిర్మిస్తున్నారంటూ పాకిస్తాన్ వ్యాఖ్యానించడంపై అయోధ్యలోని సాధువులు, మతపెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ హద్దు మీరి మాట్లాడుతోందనీ.. అవసరమైతే ఇస్లామాబాద్‌లో కూడా రామాలయం నిర్మిస్తామంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఇటీవల ట్విటర్లో స్పందిస్తూ...‘‘కొవిడ్-19 కారణంగా యావత్ ప్రపంచం ఎన్నడూ లేనంత సంక్షోభంలో ఉండగా.... ఆరెస్సెస్-బీజేపీ మాత్రం ‘హిందూత్వ’ అజెండాను ముందుకు తీసుకెళ్లడంలో మునిగిపోయాయి. ఇందులో భాగంగానే బాబ్రీ మసీదు స్థలంలో మందిర నిర్మాణం ప్రారంభించారు. దీన్ని పాకిస్తాన్ ప్రజలు, ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నాయి..’’ అని పేర్కొంది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అయోధ్య పెద్దలు.. పాకిస్తాన్‌కు గట్టి కౌంటర్ ఇవ్వాలంటూ భారత ప్రభుత్వాన్ని కోరారు. కాగా బాబ్రీపై న్యాయపోరాటం చేస్తున్న ఇక్బాల్ అన్సారీ సైతం భారత అంతర్గత వ్యవహారాల్లో పాకిస్తాన్‌ తలదూర్చడం మానుకోవాలంటూ హితవు పలికారు. 

Updated Date - 2020-05-28T23:14:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising