ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్! స్పీడ్ ఎంతో తెలిస్తే..

ABN, First Publish Date - 2020-05-23T15:35:51+05:30

మునుపెన్నడూ చూడని ఇంటర్నెట్ వేగం.. క్షణాల్లో 1కే సినిమా డౌన్‌లోడ్.. టూకీగా చెప్పుకోవాలంటే ఇదీ ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు తాజాగా సాధించిన ఘగత.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెల్‌బోర్న్: మునుపెన్నడూ చూడని ఇంటర్నెట్ వేగం.. క్షణాల్లో 1కే సినిమా డౌన్‌లోడ్.. టూకీగా చెప్పుకోవాలంటే ఇదీ ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు తాజాగా సాధించిన ఘగత. మోనాష్, స్విన్‌బర్న్, ఆర్‌ఎమ్ఐటీ యూనివర్శిటీలు ఇటీవల జరిపిన ప్రయోగంలో 44.2 టీబీపీఎస్ ఇంటర్నట్ వేగాన్ని సాధించారు. డా. బిల్ కొర్కోరాన్(మొనాష్), ఫ్రొ. ఆర్నన్ మిచెల్(ఆర్‌ఎమ్ఐటీ), డేవిడ్ మాస్(స్విన్‌బర్న్) నేతృత్వం వహిస్తున్న బృందం ఈ ఫీట్ సాధించింది. ఇందుకు సంబంధించిన వివరాలు నెచర్ కమ్యునికేషన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.


లేసర్ సాంకేతికతో నడిచే మైక్రో కాంబ్ అనే నూతన పరికరం ద్వారా వారు ఇంటర్నెట్ వేగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. కరోనా సంక్షోభంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగి.. వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోందన్న వార్తల నేపథ్యంలో దీనికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.


ఈ సాంకేతికత సాయంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందికి అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మైక్రో కాంబ్ సాయంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యవస్థల ద్వారానే హై స్పీడ్ ఇంటర్నెట్ అందిచవచ్చని వారు తెలిపారు.


సాధారణంగా ల్యాబొరెటరీ ప్రయోగాల్లో మాత్రమే సాధ్యమయ్యే వేగాన్ని.. శాస్త్రవేత్తల బృందం క్షేత్రస్థాయిలో సాధించింది. కేవలం సినిమాలు వేగంగా డౌన్‌లోడ్ చేసుకోవడమే కాకుండా స్వయం చోదక వాహనాలు, వైద్య శాస్త్రం, ఈ కామర్స్ వంటి భిన్నమైన రంగాల అభివృద్ధికి ఈ స్థాయి వేగం ఎంతో అవసరమని శాస్త్రవేత్తలు చెప్పారు. 

Updated Date - 2020-05-23T15:35:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising