ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనాలో ఉత్తుత్తినే లోపలేస్తారు: దేశపౌరులకు ఆస్ట్రేలియా వార్నింగ్

ABN, First Publish Date - 2020-07-08T04:18:15+05:30

చైనా పర్యటనకు వెళ్లే ఆస్ట్రేలియా వాసులు అప్రమత్తంగా ఉండాలంటూ ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల మరోసారి హెచ్చరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్యానె‌బెర్రా: చైనా పర్యటనకు వెళ్లే ఆస్ట్రేలియా వాసులు అప్రమత్తంగా ఉండాలంటూ ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల మరోసారి హెచ్చరించింది. సరైన కారణమేదీ లేకుండానే చైనా అధికారులు విదేశీయులను నిర్బంధించే అవకాశం ఉందని తెలిపింది. గతంలో అనేక సందర్భాల్లో అక్కడి అధికారులు జాతీయ భద్రతకు ముప్పు పేరిట విదేశీయులను నిర్బంధించారని కూడా పేర్కొంది. ఈ హెచ్చరికలతో కూడిన సర్క్యూలర్‌ను‌ స్మార్ట్ ట్రావెలర్ అనే ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉంచింది. ప్రస్తుతం కరోనా సంక్షోభం కూడా నెలకొన్న నేపథ్యంలో ఆస్ట్రేలియా పౌరులు చైనా పర్యటనకు దూరంగా ఉంటేనే మంచిదని కూడా సూచించింది. ఇటీవల చైనా ఆస్ట్రేలియా దౌత్యసంబంధాలు ఒడిదుడుకులకు లోనవుతున్న విషయం తెలిసిందే. కరోనా సంక్షోభమే దీనికి పునాది వేసింది. ఈ మహమ్మారి కట్టడిలో చైనా విఫలమైందనే అభిప్రాయం ఆస్ట్రేలియా ప్రభుత్వంలో ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తుంటారు. కాగా.. ఆస్ట్రేలియాకు చదువు కోసం వెళ్లాలనుకునే చైనా విద్యార్థుల విషయంలో చైనా ప్రభుత్వం ఇటువంటి హెచ్చరికలను గతంలో జారీ చేసింది. అక్కడ జాతి వివక్ష అధికంగా ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ చైనా విద్యార్థులకు ప్రభుత్వం సూచించింది. 

Updated Date - 2020-07-08T04:18:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising