మనది ‘సమోసా’ బంధం.. ఆసీస్ ప్రధానితో మోదీ
ABN, First Publish Date - 2020-06-01T06:24:42+05:30
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ సమోసాలను తయారుచేసి తన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని చూపారు. సమోసాతోపాటు మామిడికాయ పచ్చడిని కూడా తయారు చేసి వాటి ఫొటోలను...
న్యూఢిల్లీ, మే 31: ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ సమోసాలను తయారుచేసి తన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని చూపారు. సమోసాతోపాటు మామిడికాయ పచ్చడిని కూడా తయారు చేసి వాటి ఫొటోలను ఆయన ట్వీట్ చేశారు. ప్రధాని మోదీతో కలిసి సమోసా తినాలని ఉందని పేర్కొన్నారు. అయితే, నాలుగో తేదీన తమ మధ్య వీడియో కాన్ఫరెన్స్ మాత్రమే జరుగుతోందని వ్యాఖ్యానించారు. దీనికి మోదీ సమాధానమిస్తూ హిందూ మహాసముద్రం ఆస్ట్రేలియా, భారత్‌లను కలిపిందని, ఇప్పుడు సమోసా ఏకం చేస్తుందని మోదీ సమాధానమిచ్చారు.
Updated Date - 2020-06-01T06:24:42+05:30 IST