ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుబే అనుచరులను అరెస్టు చేసిన ఏటీఎస్

ABN, First Publish Date - 2020-07-11T23:13:47+05:30

ఎన్‌కౌంటర్‌లో హతుడైన కాన్పూర్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే అనుచరులు ఇద్దరిని మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) శనివారంనాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

థానే: ఎన్‌కౌంటర్‌లో హతుడైన కాన్పూర్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే అనుచరులు ఇద్దరిని మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) శనివారంనాడు థానేలో అరెస్టు చేసింది. అరవింద్ అలియాస్ గుడాన్ త్రివేది, అతని డ్రైవర్ సుశీల్ కుమార్ అలియాస్ సోను తివారీని మహారాష్ట్ర ఏటీఎస్ జుహూ యూనిట్ పట్టుకుంది. కాన్పూర్‌లో 8 మంది పోలీసులను కాల్చిచంపిన ఘటనకు సంబంధించి వీరిపై ఐపీసీ సెక్షన్ 302,307,120(బి) కింద కేసులు నమోదు చేసింది.


కాన్పూర్‌లో పోలీసులను కాల్చిచంపిన ఘటనలో ఒక నిందితుడి కోసం థానే ఏరియాలో ఏటీఎస్ గాలిస్తుండగా ఈ ఇద్దరూ పట్టుబడ్డారు. ఏటీఎస్ టీమ్‌కు పీఐ దయానాయక్ సారథ్యం వహించారు. 2001లో రాష్ట్ర మంత్రి సంతోష్ శుక్లా హత్య కేసుతో సహా పలు కేసుల్లో వికాస్ దుబేతో కలిసి గుడాన్ పనిచేసినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అతని పట్టుకుంటే నగదు బహుమతి ఇస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రకటించింది.

Updated Date - 2020-07-11T23:13:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising