ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాకిస్థాన్ జైళ్లలో 50 మంది ఖైదీలకు కరోనా వైరస్

ABN, First Publish Date - 2020-04-08T11:28:39+05:30

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పాకిస్థాన్ జైళ్లలోని 50 మంది ఖైదీలకు సోకడం సంచలనం రేపింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాహోర్ (పాకిస్థాన్): ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పాకిస్థాన్ జైళ్లలోని 50 మంది ఖైదీలకు సోకడం సంచలనం రేపింది. పాకిస్తాన్ దేశంలోని పంజాబ్ ప్రావిన్సు జైలులో 50 మంది ఖైదీలకు కరోనా వైరస్ పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. దీంతో కరోనా బారినపడిన ఖైదీలను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కరోనా రోగులు బయటపడిన పంజాబ్ ప్రావిన్సు జైలులోని 525 మంది ఇతర ఖైదీలను ప్రత్యేక జైలు గదులకు తరలించామని పాక్ జైళ్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ షాహిద్ బేగ్ చెప్పారు.


ఇటలీ దేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణ చేసి అరెస్టు అయిన పాక్ పౌరుడి నుంచి పాక్ జైలులోని ఖైదీలకు కరోనా సోకిందని జైలు అధికారులు చెప్పారు. ఇటలీలో అరెస్టు అయిన పాక్ పౌరుడికి గత నెల 23వతేదీన కరోనా వైరస్ సోకిందని తేలింది. ఇటలీ నుంచి వచ్చిన పాక్ ఖైదీని లాహోర్ క్యాంపుజైలులో ఉంచడం వల్ల అతని నుంచి మరో 20 మందికి కరోనా వచ్చిందని జైలు అధికారులు చెప్పారు. కరోనా వైరస్ ప్రబలుతుందనే భయంతో లాహోర్ క్యాంపు జైలులో ఉన్న 800మంది ఖైదీలకు ఇతర జైళ్లకు తరలించామని పాక్ జైలు అధికారులు చెప్పారు. పాక్ దేశంలోని 41 జైళ్లలో ఖైదీల బంధువుల సందర్శనను నిషేధించినట్లు పాక్ హోంశాఖ అధికారులు చెప్పారు.పాక్ లో కరోనా కేసుల సంఖ్య 4వేలు దాటగా, 54 మంది మరణించారు.

Updated Date - 2020-04-08T11:28:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising