ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈసారి 1,300 మంది కాదు... 100 మందే : రాష్ట్రపతి భవన్

ABN, First Publish Date - 2020-08-12T00:07:33+05:30

కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడిన విషయం తెలిసిందే. అయితే... కొన్ని ముఖ్యమైన ఘట్టాలపై కూడా కోవిడ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడిన విషయం తెలిసిందే. అయితే... కొన్ని ముఖ్యమైన ఘట్టాలపై కూడా కోవిడ్ ఎఫెక్ట్ పడింది. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి భవన్‌లో ‘ఎట్ హోం’ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా జరుపుతారు. ఈ కార్యక్రమానికి ప్రధాని, కేంద్ర మంత్రులు, అన్ని పార్టీల ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.


మామూలుగా అయితే ఈ కార్యక్రమానికి 1,200 నుంచి 1,300 మంది అతిథులు హాజరవుతారు. కానీ.. కోవిడ్ కారణంగా ఈ సంఖ్యను గణనీయంగా తగ్గించింది రాష్ట్రపతి భవన్. ఈ సారి కేవలం 90 నుంచి 100 మంది అతిథులను మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని రాష్ట్రపతి భవన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి కూడా కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా అధికారులు సర్వ సన్నాహాలు చేస్తున్నారు. 

Updated Date - 2020-08-12T00:07:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising