ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జర్మన్ ఫార్మా దిగ్గజంతో ఆస్ట్రాజెనెకా 320 మిలియన్ డాలర్ల డీల్

ABN, First Publish Date - 2020-12-02T00:18:14+05:30

బ్రిటిష్ డ్రగ్ మేకర్ ఆస్ట్రాజెనెకా, జర్మన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ గ్రెనెంథాల్ జీఎంబీహెచ్‌ మధ్య భారీ ఒప్పందం కుదిరింది. డీల్‌లో భాగంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బ్రిటిష్ డ్రగ్ మేకర్ ఆస్ట్రాజెనెకా, జర్మన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ గ్రెనెంథాల్ జీఎంబీహెచ్‌ మధ్య భారీ ఒప్పందం కుదిరింది. డీల్‌లో భాగంగా తన బ్లాక్‌బస్టర్ కొలెస్ట్రాల్ డ్రగ్ ‘క్రెస్టర్’‌ను 320 మిలియన్ డాలర్లకు గ్రెనెంథాల్‌కు ఆస్ట్రాజెనెకాకు విక్రయించింది. క్రెస్టర్ 2015లో ఆస్ట్రాజెనెకాకు 5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించిపెట్టింది. బెస్ట్ సెల్లింగ్ మెడిసిన్‌గా రికార్డులకెక్కిన క్రెస్టర్.. కంపెనీ మొత్తం ఆదాయంలో 20 శాతం ఆర్జించిపెట్టేది. అయితే, 2016లో కేన్సర్ కోసం టగ్రిస్సో, ఇమ్ఫింజి, తీవ్రమైన ఆస్తమా కోసం ఫెసెన్రా వంటి చవకైన జనరిక్ మందుల రంగ ప్రవేశంతో క్రెస్టర్‌కు ఎదురుదెబ్బ తగిలింది.


ప్రస్తుతం కరోనా వైరస్ టీకా పోరులో ఉన్న ఆస్ట్రాజెనెకా తన దృష్టిని మాత్రం దాని ముఖ్య వ్యాపారమైన కేన్సర్ డ్రగ్స్‌పైనే పెట్టినట్టు తెలుస్తోంది. కేన్సర్ చికిత్స, బ్లాక్‌బస్టర్ లంగ్ కేన్సర్ ట్రీట్‌మెంట్ ఇమ్ఫింజి వంటి మందుల విక్రయాల రేసులో ఉంది. కాగా, మంగళవారం నాటి డీల్‌లో భాగంగా క్రెస్టర్, అనుబంధ మందులను యూకే, స్పెయిన్ మినహా యూరప్‌లో 30కిపైగా దేశాల్లో అమ్ముకునే హక్కులు గ్రెనెంథాల్‌కు లభిస్తాయని ఆస్ట్రెజెనాకా పేర్కొంది. 


డీల్ కొనసాగే కాలంలో క్రెస్టర్‌ను ఆస్ట్రాజెనెకా ఉత్పత్తి చేస్తూ దానిని గ్రెనెంథాల్‌కు సరఫరా చేస్తుంది. అదే సమయంలో నార్త్ అమెరికా, చైనాలో విక్రయిస్తామని పేర్కొంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నాటికి ఈ డీల్ ముగిస్తుందని ఆస్ట్రాజెనెకా తెలిపింది. 

Updated Date - 2020-12-02T00:18:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising