ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసోం మాజీ మహిళా ముఖ్యమంత్రి కన్నుమూత

ABN, First Publish Date - 2020-09-29T12:33:58+05:30

అసోం మాజీ మహిళా ముఖ్యమంత్రి సైదా అన్వర తైమూర్ (84) అనారోగ్యంతో ఆస్ట్రేలియాలో కన్నుమూశారు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : అసోం మాజీ మహిళా ముఖ్యమంత్రి  సైదా అన్వర తైమూర్ (84) అనారోగ్యంతో ఆస్ట్రేలియాలో కన్నుమూశారు. అసోం రాష్ట్రంలో సైదా అన్వర తైమూర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా 4 దశాబ్దాల పాటు పనిచేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సైదా అన్వర అసోం మొట్టమొదటి మహిళా సీఎంగా సేవలందించారు. గత కొన్నేళ్లుగా సైదా అన్వర ఆస్ట్రేలియాలో ఉన్న తన కుమారుడి వద్ద ఉంటున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన సైదా అన్వర కన్ను మూశారు. 


సైదా అన్వరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అసోం సీఎం సర్బానద సోనోవాల్, అసోం ఆరోగ్యశాఖ మంత్రి హిమంతబిశ్వా శర్మ తదితరులు సంతాపం తెలిపారు. అసోం సీఎంగా, రాజ్యసభసభ్యురాలిగా సైదా అన్వర అసోం అభివృద్ధికోసం పాటుపడ్డారని వెంకయ్యనాయుడు చెప్పారు. అసోం అభివృద్ధిలో సైదా పాత్ర మరవలేనిదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-29T12:33:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising