ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసోంను వణికిస్తున్న వరదలు.. మరో ఆరుగురి మృతి

ABN, First Publish Date - 2020-07-14T03:29:15+05:30

వరదలు అసోంను వణికిస్తున్నాయి. రోజురోజుకు పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతున్నాయి. వరదల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గువాహటి: వరదలు అసోంను వణికిస్తున్నాయి. రోజురోజుకు పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతున్నాయి. వరదల కారణంగా సోమవారం మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 50కి పెరిగింది. కొండచరియలు విరిగిపడడం వల్ల మరో 26 మంది మృతి చెందారు. అసోం విపత్తు నిర్వహణ అథారిటీ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలోని 27 జిల్లాల్లోని 2,763 గ్రామాలకు చెందిన 21.63 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారు. 1,03,806 హెక్టార్ల పంట దెబ్బతింది. 


వరదల వల్ల పొంగి ప్రవహిస్తున్న నదుల కారణంగా చాలా ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. బ్రహ్మపుత్ర, ధన్‌సిరి, బుర్హి దెహింగ్, జియా భరాలి, పుథిమరి, బేకి, కోపిలి, శంకోష్, సుబన్‌సిరి, పగ్లాడియా, కతాఖల్, కుషియారా వంటి పెద్ద నదులు ఏడు ప్రాంతాల్లో ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. 20 జిల్లాలో ఏర్పాటు చేసిన 480 పునరావాస కేంద్రాల్లో 60,696  మంది ఆశ్రయం పొందుతున్నారు.     

Updated Date - 2020-07-14T03:29:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising