ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసోం డీజీపీకి కరోనా పాజిటివ్

ABN, First Publish Date - 2020-08-10T22:26:45+05:30

అసోం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంతా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్లో ఉన్నట్టు పోలిస్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గువహటి: అసోం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంతా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్లో ఉన్నట్టు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ‘‘ప్రొటోకాల్స్ ప్రకారం ఆరోగ్య శాఖ అధికారులు ఇటీవల ఆయనకు సమీపంగా మెలిగిన అందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు...’’ అని ఆయన తెలిపారు. మార్చి నుంచి ఇప్పటి వరకు అసోం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో దాదాపు 30 మంది కొవిడ్-19 బారిన పడ్డారు. ఇన్ఫెక్షన్‌కు గురైన వారిలో ఐజీపీ (లా అండ్ ఆర్డర్), డీఐజీ (అడ్మినిస్ట్రేషన్) తదితరులు కూడా ఉన్నారు. కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,259 మంది పోలీస్ సిబ్బంది కరోనా బారిన పడినట్టు అసోం అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) జీపీ సింగ్ నిన్న వెల్లడించారు. వీరిలో 1,734 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు ఆయన తెలిపారు. ‘‘దురదృష్ట వశాత్తూ ఇప్పటి వరకు ఆరుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు..’’ అని సింగ్ తెలిపారు. అసోంలో ఇప్పటి వరకు 58,837 మంది కొవిడ్-19 బారిన పడగా.. ఇప్పటి వరకు 42,325 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ఈ మహమ్మారి కారణంగా రాష్ట్రంలో 145 మంది మృత్యువాత పడ్డారు. 

Updated Date - 2020-08-10T22:26:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising