ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలపై ప్రియాంక దృష్టి

ABN, First Publish Date - 2020-07-02T15:42:57+05:30

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 2022 లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ దృష్టి సారించనున్నారా ? అంటే అవునంటున్నాయి కాంగ్రెస్ పార్టీ ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ నుంచి లక్నోలోని కౌల్ హౌస్‌కు మారనున్న ప్రియాంకగాంధీ

లక్నో (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 2022 లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ దృష్టి సారించనున్నారా ? అంటే అవునంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు...న్యూఢిల్లీ లోధి ఎస్టేట్‌లోని ప్రభుత్వ బంగ్లాను నెలరోజుల్లోగా ఖాళీ చేయాలని కేంద్ర భవనాలు, పట్టణాభివృద్ధి శాఖ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ప్రియాంకా వాద్రా తన మకాంను యూపీ లక్నో నగరానికి మకాం మార్చాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇందిరాగాంధీ సమీపబంధువు అయిన కేంద్ర మాజీ మంత్రి  షీలాకౌల్ లక్నోలో ఓ భవనముంది. కౌల్ హౌస్ బంగళాను ప్రియాంక నివాసముండేందుకు దాన్ని తాజాగా మరమ్మతులు చేయించారని లక్నో కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం యూపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు వీలుగా తాను ఢిల్లీ నుంచి లక్నోకు మకాం మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం. గతంలో ఇందిరాగాంధీ కూడా తన భర్త ఫిరోజ్ గాంధీతో కలిసి లక్నోలోని ఏపీసేన్ రోడ్డులో నివాసమున్నారు. ప్రియాంకగాంధీ లక్నోకు మకాం మారిస్తే కాంగ్రెస్ పార్టీని పటిష్ఠం చేసి ఎన్నికలకు సమాయత్తపర్చేందుకు వీలవుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలంటున్నారు. 

Updated Date - 2020-07-02T15:42:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising