ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

20% మంది కరోనా ఆధీనంలోనే ఉన్నారట

ABN, First Publish Date - 2020-03-24T23:11:30+05:30

మొదటి లక్ష మందికి కరోనా సోకడానికి 67 రోజులు పట్టగా కేవలం నాలుగు రోజుల్లోనే మరో లక్ష మందిని కరోనా ఆవహించింది. దీంతో దీనిని ప్రపంచ మహమ్మారిగా డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. అవసరమైతే 170 కోట్ల మందిని నిర్బంధంలోనే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాభాలో ప్రతి ఐదుగరిలో ఒకరు (20 శాతం మంది) కరోనా ఆధీనంలోనే ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. వైద్యులు, ప్రభుత్వాలు ఇచ్చే సూచనలు పాటించకుంటే వీరంతా కరోనా బారిన పడతారని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. మంగళవారం ఉదయం నాటికి ప్రపంచ వ్యాప్తంగా 3,78,679 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. 16,500 మందికి పైగా కరోనా కారణంగా మృత్యువాతపడ్డారు. కాగా, ఇప్పటి వరకు 1,01,000 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.


మొదటి లక్ష మందికి కరోనా సోకడానికి 67 రోజులు పట్టగా కేవలం నాలుగు రోజుల్లోనే మరో లక్ష మందిని కరోనా ఆవహించింది. దీంతో దీనిని ప్రపంచ మహమ్మారిగా డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. అవసరమైతే 170 కోట్ల మందిని నిర్బంధంలోనే ఉంచాలని, వారిని బయటికి రాకుండా చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌వో కోరింది.

Updated Date - 2020-03-24T23:11:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising