ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్, చైనా సైనిక దళాల మధ్య ఘర్షణ...కల్నల్ సహా ఇద్దరు జవాన్ల మృతి

ABN, First Publish Date - 2020-06-16T19:00:34+05:30

భారత, చైనా సరిహద్దుల్లోని లడఖ్ ప్రాంతంలో గాల్వాన్ లోయలో భారత, చైనా సైనిక దళాల మధ్య సోమవారం రాత్రి జరిగిన కాల్పుల్లో ఆర్మీ కల్నల్ సహా ఇద్దరు జవాన్లు మరణించారు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లడఖ్ : భారత, చైనా సరిహద్దుల్లోని లడఖ్ ప్రాంతంలో గాల్వాన్ లోయలో భారత, చైనా సైనిక దళాల మధ్య సోమవారం రాత్రి జరిగిన ఘర్ణణలో భారత ఆర్మీ కల్నల్ సహా ఇద్దరు జవాన్లు మరణించారు. మరణించిన వారిలో భారత పదాతిదళానికి చెందిన వారున్నారు. ఈ ఘర్షణతో తూర్పు లడఖ్ ప్రాంతంలోని వాస్తవనియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత,  చైనా సైనిక బలగాల మధ్య హింసాత్మక దాడికి దారితీసిన కారణాలు ఇంకా తెలియరాలేదు. నెలన్నర రోజులుగా లడఖ్ ప్రాంతంలో భారత్, చైనా దళాలు మోహరించి ఉన్నాయి. గాల్వాన్ లోయ, పాంగోంగ్ త్సోలోని నియంత్రణ రేఖ వద్ద చైనా సైనిక శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. చైనా సైనికులు సరిహద్దుల్లో ఉనికిని పెంచుకున్న నేపథ్యంలో భారత సైనిక దళాలు, వాహనాలు, ఫిరంగి తుపాకులను తూర్పు లడఖ్‌కు పంపించినట్లు భారత ప్రభుత్వం తెలిపింది. 

Updated Date - 2020-06-16T19:00:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising