ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిలట్రీ ఆసుపత్రిలో సైనికులను కలిసిన నరవనే

ABN, First Publish Date - 2020-06-23T22:21:09+05:30

తూర్పు లడక్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవనే భారత సైనికుల్లో మరింత ఆత్మస్థైర్యం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లెహ్: తూర్పు లడక్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవనే భారత సైనికుల్లో మరింత ఆత్మస్థైర్యం నింపారు. లెహ్ మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాహస సైనికులను మంగళవారంనాడు కలిసి వారిని అభినందించారు. వారితో నేరుగా మాట్లాడి వారిని మరింత ఉత్తేజితులను చేశారు. ఇండియన్ ఆర్మీ ఓ ట్వీట్‌లో ఈ విషయాన్ని తెలియజేసింది.


నరవనే తన పర్యటనలో భాగంగా లడక్‌లో వాస్తవ పరిస్థితిని, చైనా మిలటరీతో చర్యల ప్రగతిని అధికారులతో కలిసి సమీక్షించనున్నారు. ఆర్మీ అధికారుల సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న రెండ్రోజుల కమాండర్స్ కాన్ఫరెన్స్ సదస్సులో పాల్గొనేందుకు కమాండర్లు అంతా దేశ రాజధానిలోనే ఉన్నారు.


గల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన నేపథ్యంలో ఉద్రిక్తతలను సడలించేందుకు ఇండియా, చైనా మధ్య మిలటరీ స్తాయి చర్చలు జరుగుతున్నతరుణంలోనే కమాండర్ల సదస్సు ఢిల్లీలో జరుగుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - 2020-06-23T22:21:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising