మొబైల్ ఇంటర్నెట్ ధరలు భారీగా పెరగనున్నాయా ?
ABN, First Publish Date - 2020-03-16T23:03:32+05:30
భారతీయ మొబైల్ వినియోగదారులకు త్వరలోనే మొబైల్ బిల్లుల మోత మోగనున్నట్లు పరిణామాలు చెబుతున్నాయి. టెలికాం ఆపరేటర్లు కోరినట్టుగా... రేట్ల(కనీస రేట్లు)ను నిర్ణయించినట్టయితే ప్రస్తుత స్థాయి నుంచి మొబైల్ ఇంటర్నెట్ ధరలు 5-10 రెట్లు పెరుగుతాయని భావిస్తున్నారు. మొబైల్ ఆపరేటర్ల ప్రతిపాదనలకు ప్రభుత్వం అనుకూలంగా స్పందిస్తే.. మొబైల్ ఇంటర్నెట్ ధరలు 5-10 రెట్లు పెరిగే అవకాశముంది.
న్యూఢిల్లీ : భారతీయ మొబైల్ వినియోగదారులకు త్వరలోనే మొబైల్ బిల్లుల మోత మోగనున్నట్లు పరిణామాలు చెబుతున్నాయి. టెలికాం ఆపరేటర్లు కోరినట్టుగా... రేట్ల(కనీస రేట్లు)ను నిర్ణయించినట్టయితే ప్రస్తుత స్థాయి నుంచి మొబైల్ ఇంటర్నెట్ ధరలు 5-10 రెట్లు పెరుగుతాయని భావిస్తున్నారు. మొబైల్ ఆపరేటర్ల ప్రతిపాదనలకు ప్రభుత్వం అనుకూలంగా స్పందిస్తే.. మొబైల్ ఇంటర్నెట్ ధరలు 5-10 రెట్లు పెరిగే అవకాశముంది.
కనీసం 1 జీబీ ధరను రూ. 35 గా నిర్ణయించాలని వోడాఫోన్, ఐడియా, రూ. 30 గా ఉండాలని, ఎయిర్‌టెల్, రూ. 20 కనీస ఛార్జీగా ఉండాలని రిలయన్స్ జియో ఇప్పటికే ట్రాయ్‌కు ప్రతిపాదించాయి. కాగా.. ఈప్రతిపాదనలకు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ సానుకూలంగా స్పందించారు. ఇటీవలి ఏజీఆర్ సంక్షోభం, టెలికాం రంగానికి భారీగా అప్పులు రావడం, ధరలు నిలకడగా తగ్గడం వల్ల ఇంతకుమించి వేరే మార్గం లేదని,అయితే ఇది దీర్ఘకాలిక పరిష్కారం కాదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
కాగా.. ఈప్రతిపాదనలకు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ సానుకూలంగా స్పందించారు. ఇటీవలి ఏజీఆర్ సంక్షోభం, టెలికాం రంగానికి భారీగా అప్పులు రావడం, ధరలు నిలకడగా తగ్గడం వల్ల ఇంతకుమించి వేరే మార్గం లేదని,అయితే ఇది దీర్ఘకాలిక పరిష్కారం కాదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
Updated Date - 2020-03-16T23:03:32+05:30 IST