ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనూరాగ్ ఠాకూర్ చెత్తగా మాట్లాడారు: శశిథరూర్

ABN, First Publish Date - 2020-09-19T01:26:00+05:30

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్‌పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్‌పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మండిపడ్డారు. లోక్‌సభలో శుక్రవారంనాడు ఠాకూర్ మాట్లాడిన తీరు ఏమాత్రం పసలేని విధంగా, కేవలం రాజకీయ ప్రసంగంలా సాగిందని, ఫలితంగా సభ నాలుగు సార్లు వాయిదా పడిందని శిశథరూర్ అన్నారు.


ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన టాక్సేషన్ బిల్లుపై విపక్ష ఎంపీలు లేవనెత్తిన అభ్యంతరాలపై మాత్రం ఠాకూర్ పెదవి విప్పలేదని శిశిథరూర్ ఎద్దేవా చేశారు. 'దేశం అనేక సమస్యలతో సతమతమవుతోంది. దేశ చరిత్రలో అత్యంత దయనీయమైన నిరుద్యోగ లెక్కలు కళ్లముందున్నాను. ఇంకోవైపు కోవిడ్‌పై పోరాడుతున్నాం. చైనా దురాక్రమణలు కొనసాగుతున్నారు. ఇలాంటి తరుణంలో అధికార పక్షం సభలో లేని ఒక కుటుంబంపై నిందారోపణలు చేస్తూ సభాసమయాన్ని వృథా చేస్తోంది' అని శిశిథరూర్ మండిపడ్డారు.


కేవలం దేశం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, సభలో అంశాల చర్చపై  ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. విపక్షాల విమర్శలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదన్నారు. విపక్షాల నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా హడావిడిగా బిల్లులు ప్రవేశపెట్టి, సభాకార్యక్రమాలను ముగించేయాలన్న ఏకైక ఎజెండా తప్పితే కేంద్రానికి మరో ఆలోచనే లేదని శశిథరూర్ నిశితంగా విమర్శించారు.

Updated Date - 2020-09-19T01:26:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising