ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నాడీఎంకే, బీజేపీ పొత్తు పదిలం!

ABN, First Publish Date - 2020-11-22T09:40:42+05:30

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు కొనసాగుతుందని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈపీఎస్‌, ఓపీఎస్‌ ప్రకటన.. ధ్రువీకరించిన అమిత్‌ షా 

చెన్నై, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు కొనసాగుతుందని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం ప్రకటించారు. చెన్నై ప్రజల దాహార్తిని తీర్చేందుకు కొత్తగా నిర్మించిన తేర్వాయ్‌కండ్రిగ జలాశయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా జాతికి అంకితం చేశారు. చెన్నై మెట్రో రైలు రెండో దశ విస్తరణ పనులు, తదితర పథకాలకూ శంకుస్థాపన చేశారు. ఈ సభలో ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ.. బీజేపీతో పొత్తు కొనసాగుతుందన్నారు. ఈ సభలో ప్రసంగించిన అమిత్‌షా కూడా అన్నాడీఎంకే ప్రభుత్వానికి.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, రెండు పార్టీల మధ్య పొత్తు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని ధ్రువీకరించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం మధ్యాహ్నం చెన్నైకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేరుకున్నారు. మీనంబాక్కం రహదారి పొడవునూ బీజేపీ కార్యకర్తలు పార్టీ జెండాలతో స్వాగతం పలికారు. దీంతో అమిత్‌ షా కారు ఆపి రోడ్డుపై నడుస్తూ, చేతులూపుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు.

Updated Date - 2020-11-22T09:40:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising