ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాహుల్ ను అడుగుపెట్టనివ్వం : హోంమంత్రి

ABN, First Publish Date - 2020-10-04T18:11:14+05:30

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్రాక్టర్ ర్యాలీని ఎట్టి పరిస్థితుల్లోనూ హర్యానాలో అడుగుపెట్టనివ్వమని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హర్యానా : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్రాక్టర్ ర్యాలీని ఎట్టి పరిస్థితుల్లోనూ హర్యానాలో అడుగుపెట్టనివ్వమని హోంమంత్రి అనిల్ విజ్ ప్రకటించారు. బీజేపీ అధ్యక్షుడు ఓపీ ధన్కడ్ కూడా ఇదే రీతిలో స్పందించారు. రాహుల్ గాంధీ కనుక హర్యానాలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తే, ఆ ర్యాలీకి రాబర్ట్ వాద్రాను కూడా తీసుకొని రావాలని సవాల్ విసిరారు. లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టే సమయంలో రాహుల్ ఎందుకు గైర్హాజర్ అయ్యారో చెప్పాలని అకాలీదళ్ ప్రశ్నించింది.


కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ రాష్ట్రంలో మూడు రోజుల పాటు ట్రాక్టర్ ర్యాలీలను నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ ర్యాలీలకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్వయంగా హాజరై, ట్రాక్టర్ నడిపి నిరసన వ్యక్తం చేయనున్నారు. ఆ ర్యాలీ పంజాబ్‌లో మొదలై, హర్యానాలో ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాహుల్‌ ర్యాలీకి ప్రవేశం ఉండదన హోంమంత్రి అనిల్ విజ్ ప్రకటించారు. 


Updated Date - 2020-10-04T18:11:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising