ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పతంజలిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: మహారాష్ట్ర హోం మంత్రి

ABN, First Publish Date - 2020-06-25T18:41:12+05:30

ముంబై: పతంజలిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాంమని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. కరోనాకు నివారణగా కరోనిల్ మందు తయారుచేశామంటూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: పతంజలిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాంమని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. కరోనాకు నివారణగా కరోనిల్ మందు తయారుచేశామంటూ ప్రకటనలు చేస్తోన్న పతంజలిపై చర్యలు తప్పవన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి పూర్తి స్థాయిలో అనుమతి రానిదే మహారాష్ట్రలో అమ్మాలని చూసినా, ప్రచారం చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 


150కి పైగా ఔషధ మొక్కలతో తాము తయారు చేసిన కరోనిల్ మాత్రలు వేసుకుంటే వారం రోజుల్లో కరోనా పూర్తిగా తగ్గిపోతుందని రెండ్రోజుల క్రితం బాబా రాందేవ్ ప్రకటించారు. కరోనిల్ తీసుకున్న వారిలో ఒక్కరూ చనిపోలేదని, వంద శాతం కోలుకున్నారని చెప్పారు. కరోనిల్ మాత్రలు వేసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు.




అయితే మందు తయారు చేసే క్రమంలో పతంజలి చేపట్టిన క్లినికల్ ట్రయల్ వివరాలు అందించాలని కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దీంతో పతంజలి సంస్థ వివరాలన్నింటినీ కేంద్రానికి అందజేసింది. కరోనిల్‌కు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆమోదం లభించగానే యాప్ ద్వారా అమ్మకాలు చేయాలని పతంజలి సన్నద్ధంగా ఉంది. 

Updated Date - 2020-06-25T18:41:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising