ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెటిజన్లకు సారీ చెప్పిన ఆనంద్ మహీంద్రా!

ABN, First Publish Date - 2020-04-27T02:07:23+05:30

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామిక వేత్త..తాజా ట్వీట్‌లో తన పెద్దరికాన్ని చాటుకున్నారు. తన ద్వారా అనుకోకుండా జరిగిన తప్పును బహింరంగానే అంగీకరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామిక వేత్త..తాజా ట్వీట్‌లో తన పెద్దరికాన్ని చాటుకున్నారు. తన ద్వారా అనుకోకుండా జరిగిన తప్పును బహింరంగానే అంగీకరించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆనంద్ మహీంద్రా ఇటీవల ఆకులనే మాస్కులుగా ధరించిన ఇద్దరు బాలికల ఫొటోలను ట్వీట్ చేశారు. కరోనా పరిస్థితికి ఈ ఫోటో అద్దం పడుతోందన్న ఆయన.. ప్రకృతి మనుషులకు కావాల్సిన వన్నీ సమకూరుస్తుందని కామెంట్ చేశారు. ఇది క్షణాల్లో వైరల్ అవడంతో వెంటనే ఓ నెటిజన్ ట్విట్‌లోని దోషాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. ఆకులు కరోనా వైరస్‌ను అడ్డుకుంటాయని శాస్త్రీయంగా నిరూపణ కాలేదని, పేదరికం కారణంగానే వారు ఆకులను మాస్కులుగా ధరించారని అన్నారు. బలహీలన వర్గాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందనటానికి ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు.


ఈ ట్వీట్లపై ఆనంద మమీంద్రా కూడా తన స్థాయికి తగ్గుట్టు హుందాగా స్పందించారు. ట్వీట్‌లో దొర్లిన పొరపాటును అంగీకరించారు. ‘మీరు అన్నది కర్టక్టె. ఆ ఫోటోలో వ్యక్తమవుతున్న ఆర్థిక అసమానత స్పందించాల్సింది. ఇప్పుడే ఆ ట్వీట్‌ను డిలీట్ చేస్తున్నా’ అని వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యారు. దీంతో సహజంగానే నెటిజన్లు ఆయన పెద్దరికానికి ఫిదా అయిపోయారు. ‘భిన్న అభిప్రాయాలను హుందాగా స్వీకరించినందుకు మీకు హాట్సాఫ్’ అంటూ ఆయనపై ప్రసంశల వర్షం కురిపించారు.

Updated Date - 2020-04-27T02:07:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising