ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా వస్తువులు వాడద్దన్న అమూల్‌కు చేదు అనుభవం..

ABN, First Publish Date - 2020-06-07T01:11:24+05:30

భారతదేశంలోనే అతిపెద్ద డెయిరీ కంపెనీ అమూల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆ కంపెనీ ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేసి, ఆ తర్వాత దానిని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాంధీనగర్: భారతదేశంలోనే అతిపెద్ద డెయిరీ కంపెనీ అమూల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆ కంపెనీ ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేసి, ఆ తర్వాత దానిని పునరుద్ధరించారు. చైనా వస్తువులను బాయ్‌కౌట్ చేయడాన్ని సమర్ధిస్తూ పోస్ట్ చేసిన కొద్ది గంటలకే అమూల్ ట్విట్టర్ ఖాతాను తాత్కాలికంగా ట్విట్టర్ ఇండియా డీయాక్టివేట్ చేసింది. దీనిపై నెటిజెన్ల నుంచి ఒక్కసారిగా విమర్శలు రావడంతో వెంటనే ఆ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించారు. ఈ విషయాన్ని గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోధి శనివారంనాడు మీడియాకు తెలియజేశారు.


'అమూల్ అకౌంట్ డీయాక్టివేషన్‌కు కారణంపై మైక్రో బ్లాగింగ్ సైట్‌ ట్విట్టర్‌ను కంపెనీ సంప్రదించింది. జూన్ 4న మా అకౌంట్‌ను బ్లాక్ చేశారు. మా శ్రేయాభిలాషుల ద్వారా ఆ విషయం మా దృష్టికి వచ్చింది. కొన్ని ప్రోటాకాల్స్ అనంతరం తిరిగి మా ఖాతను పునరుద్ధరించారు' అని సోధి చెప్పారు.


'అమూల్ టాపికల్: అబౌట్ ది బాయ్‌కాట్ ఆఫ్ చైనీస్ ప్రోడక్ట్స్' అనే క్యాప్షన్‌తో జూన్ 3న అమూల్ కంపెనీ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసింది. ఆ తర్వాత అమూల్ అకౌంట్‌ డీయాక్టివేట్ అయింది. కొందరు నెజిటిన్లు ఈ విషయం అమూల్ దృష్టికి తెచ్చారు. ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేసి ఉండొచ్చనే అనుమానాలను వ్యక్తం చేశారు. దీనిపై సోథి మరో ట్వీట్‌లో వివరణ ఇస్తూ, సాంకేతిక కారణాల వల్లే అకౌంట్‌ బ్లాక్ చేశామని, పోస్ట్ చేసిన అంశం ఇందుకు కారణం కాదని ట్విట్టర్ ఇండియా ఎండీ తనకు వివరణ ఇచ్చినట్టు తెలిపారు. ఎట్టకేలకు ఆ మరుసటి రోజు ఉదయమే అమూల్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించారు.

Updated Date - 2020-06-07T01:11:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising