ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది రాబందువాదం కాక మరేమిటి?.. అమిత్ షా ర్యాలీపై తేజస్వీ మండిపాటు

ABN, First Publish Date - 2020-06-06T23:29:06+05:30

బీహార్‌లో అమిత్‌షా ఆదివారం నిర్వహించనున్న వర్చువల్ ర్యాలీపై ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ తీవ్రస్థాయిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బీహార్‌లో అమిత్‌షా ఆదివారం నిర్వహించనున్న వర్చువల్ ర్యాలీపై ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశం మొత్తం కరోనా వైరస్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే బీజేపీ ఎన్నికల కోసం తాపత్రయపడుతుండడం ‘రాజకీయ రాబందువాదమే’నని ధ్వజమెత్తారు. జనం చనిపోతున్నా బీజేపీకి పట్టడం లేదని, దానికి కావాల్సింది ఎన్నికల్లో విజయం సాధించడమేనని అన్నారు. రాష్ట్రంలోని 15 ఏళ్ల విభజిత, విఫల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకే భావజాలం కలిగిన, పేదల అనుకూల పార్టీలు ఒక్కటి కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్ష కూటమిలో భేదాభిప్రాయాలున్నాయన్న వార్తలపై స్పందించిన తేజస్వీ.. ఏ ప్రజాస్వామ్యంలోనైనా విరుద్ధ అభిప్రాయాలు ఉండడం మంచిదేనన్నారు.


బీహార్‌లో ఎన్నికల శంఖారావం పూరించేందుకు బీజేపీ సిద్ధమైంది. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ సీనియర్ నేత అమిత్ షా ఆదివారం వీడియో కాన్ఫరెన్స్, ఫేస్‌బుక్ లైవ్ ద్వారా ప్రసంగించనున్నట్టు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి 243 అసెంబ్లీ స్థానాల్లోని లక్ష మంది ప్రజలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. కాగా, ప్రస్తుత సంక్షోభ సమయంలో రైతులు, కూలీల చేతుల్లో ఖాళీ పేట్లు పెట్టిందని ఆరోపించారు. దీనికి నిరసనగా ‘గరీబ్ అధికార్ దివస్’ కార్యక్రమంలో భాగంగా రేపు(ఆదివారం)  ప్లేట్లు, గిన్నెలు మోగించి ప్రభుత్వాన్ని మేల్కొలుపుతామని తేజస్వీ యాదవ్ ట్వీట్ చేశారు.  

Updated Date - 2020-06-06T23:29:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising