ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిజాముద్దీన్ ఘటనపై ఉన్నతాధికారులతో అమిత్ షా కీలక భేటీ!

ABN, First Publish Date - 2020-04-01T03:21:21+05:30

కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. హోంశాఖ ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూ ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. హోంశాఖ ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన హోంశాఖ సెక్రటరీ అజయ్ బల్లా, అంతర్గత భద్రత జాయింట్ సెక్రటరీ ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ భేటీలో నిజాముద్దీన్ ఘటన, విదేశీయుల కార్యకలపాలపై నిశితంగా చర్చించినట్లు సమాచారం.


చర్చకొచ్చిన కీలక విషయాలివే..

తగ్లీ జమత్ కార్యక్రమంలో హాజరైన విదేశీయుల వీసాలు రద్దు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. భేటీలో దీనిపై పది నిమిషాల పాటు చర్చించారని సమాచారం. తగ్లీ జమత్ కార్యక్రమంలో పాల్గొన్న దేశంలోకి వచ్చిన విదేశీయుల పూర్తి సమాచారం ఇవ్వాలని విదేశీ మంత్రిత్వ శాఖను కోరినట్లు సమాచారం. వీరికి నిధులు అందించిన సంస్థలేవి..? వారు ఎక్కడ ఉంటున్నారు..? వీసా పొందేందుకు ఎవరి నుంచి అనుమతి కోరారు..? వంటి వివరాలన్నింటిని బయటికి తీయాలని అధికారులను అమిత్ షా ఆదేశించినట్లు తెలుస్తోంది.


వీటితో పాటు.. అంతర్గత భద్రతపై అమిత్ షా సమీక్షించారు. కశ్మీర్ సహా వివిధ రాష్ట్రాల పరిస్థితులపై హోం మంత్రి ఆరా తీసినట్లు సమాచారం.

Updated Date - 2020-04-01T03:21:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising