ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిసర్గ తుపాను సన్నద్ధతను సమీక్షించిన అమిత్‌షా

ABN, First Publish Date - 2020-06-02T01:08:43+05:30

భారత్‌కు నిసర్గ తుపాను ముప్పు పొంచి ఉంచడంతో కేంద్రం అప్రమత్తమైంది. తుపాను ముప్పును ఎదుర్కునేందుకు తీసుకోవాల్సిన ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: భారత్‌కు నిసర్గ తుపాను ముప్పు పొంచి ఉంచడంతో కేంద్రం అప్రమత్తమైంది. తుపాను ముప్పును ఎదుర్కునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సన్నద్ధతలపై హోం మంత్రి అమిత్‌షా సోమవారంనాడు అధికారులతో కలిసి సమీక్షించారు.


అగ్నేయ అరేబియా సముద్రంలో ఆదివారం ఏర్పడిన అల్పపీడనం సోమవారం వాయుగుండంగా, అనంతరం తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ తుపాను జూన్ 3వ తేదీ సాయంత్రానికి దక్షిణ గుజరాత్, ఉత్తర మహారాష్ట్ర తీరాలకు చేరవచ్చని కూడా వాతావరణ పరిశోధన శాఖ చెబుతోంది. ఇటీవల పశ్చిమబెంగాల్‌, ఒడిశాను అతలాకుతలం చేసిన అంపన్ సైక్లోన్ తర్వాత సిసర్గ తుపాను హెచ్చరిక వెలువడటంతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో అమిత్‌షా ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఎన్‌డీఎంఏ, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఐఎండీ ఎజెన్సీలు, కోస్ట్ గార్డ్ అధికారులు, హోం శాఖ అధికారులు పాల్గొన్నట్టు హోం మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2020-06-02T01:08:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising