ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలకు సాయం చేయడానికి భూమి అమ్మిన అన్నదమ్ములు

ABN, First Publish Date - 2020-04-25T22:31:02+05:30

కర్ణాటకలోని కోలార్ ప్రాంతానికి చెందిన తాజమ్ముల్ పాషా, ముజామ్మిల్ పాషా అనే ఇద్దరు అన్నదమ్ములు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాయి. కరోనా మహమ్మారితో కకావికలమైన పేదవారికి తమవంతు సాయంలో భాగంగా వారికున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కోవిడ్-19 లాక్‌డౌన్‌తో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆదాయ మార్గాలు లేక ఆకలికి అలమటిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వాల నుంచే సాధారణ ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. తమకు తోచినంత, ఒక్కోసారి తోచిన దాని కంటే ఎక్కువగానే సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. పేదలకు నిత్యవసరాలు అందించేందుకు ఇద్దరు అన్నదమ్ములు చేసిన ఓ సాహసాన్ని ఇక్కడ తప్పక ప్రస్తావించాలి.


కర్ణాటకలోని కోలార్ ప్రాంతానికి చెందిన తాజమ్ముల్ పాషా, ముజామ్మిల్ పాషా అనే ఇద్దరు అన్నదమ్ములు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాయి. కరోనా మహమ్మారితో కకావికలమైన పేదవారికి తమవంతు సాయంలో భాగంగా వారికున్న భూమిని 25 లక్షల రూపాయలకు అమ్మేశారు. ఈ డబ్బుతో తమ ప్రాంతంలోని రోజూ కూలీలకు, పేదలకు నిత్యవసర సరుకులు పంచారు.


అంతే కాకుండా వారి ఇంటి పక్కన ఒక కమ్యూనిటీ కిచెన్‌ను ఏర్పాటు చేసి ఆకలిగొన్న వారికి ఆహారం అందిస్తున్నారు. ‘‘మా నాన్న ఈ మధ్యే చనిపోయారు. మేమూ మా అమ్మమ్మగారింటికి తరలిపోయాం. అయితే హిందూ, ముస్లిం, సిక్కు ఇలా అన్ని మతాలకు చెందిన వారు మమ్మల్ని సాయం కోరారు’’ అని తాజమ్ముల్ పాషా అన్నారు.


‘‘మేము ఒకప్పుడు చాలా పేదరికంలో ఉన్నాము. అందరి సహకారంతోనే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాము. అందులో అన్ని మతాల వారు ఉన్నారు. మానవత్వాన్ని చూపించాల్సిన అవసరమైన సమయమిది. మేము సొసైటీ అగ్రిమెంట్‌ బాండ్‌పై సంతకం చేసి మా భూమిని మా స్నేహితుడికి విక్రయించాం’’ అని ఇద్దరు అన్నదమ్ములు పేర్కొన్నారు.

Updated Date - 2020-04-25T22:31:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising