ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికన్లు ఇక ఆ సంప్రదాయాన్ని మర్చిపోవాలి: ప్రముఖ అమెరికా శాస్త్రవేత్త

ABN, First Publish Date - 2020-04-10T01:06:58+05:30

తరతరాలుగా వస్తున్న సంస్కృతి సంప్రదాయాలకు కరోనా మహమ్మారి మంగళం పాడేస్తోంది. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని మరోమారు రుజువు చేశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: తరతరాలుగా వస్తున్న సంస్కృతి సంప్రదాయాలకు కరోనా మహమ్మారి మంగళం పాడేస్తోంది. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని మరోమారు రుజువు చేశాయి. అమెరికన్లు భవిష్యత్తులో ఇంకెప్పుడూ షేక్ హ్యాండ్లు ఇవ్వకూదని అంటువ్యాధుల నిపుణుడు ఆంథోని ఫాసీ సూచించారు. దీని వల్ల అమెరికాలో కరోనా వ్యాప్తిని అరికట్టడంతో పాటూ ఇన్‌ఫ్లుయెంజా కేసుల సంఖ్య కూడా బాగా తగ్గించవచ్చన్నారు.


‘మీతో ఉన్నదున్నట్టుగా చెప్పాలంటే.. అమెరికన్లు ఇంకెప్పుడూ షెక్ హ్యాండ్లు ఇవ్వకూడదు.’ అని ఇటీవల వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. ‘మనం చేతులు కలపడం అనే సంప్రదాయానికి ఫుల్‌స్టాప్ పెట్టాలి. అసలు ఈ సాంప్రదాయాన్ని పూర్తిగా మర్చిపోవాలి. ఎందుకంటే దీని ద్వారానే శ్వాసకోస సంబంధిత వ్యాధులు వ్యాపిస్తున్నాయి’ అని మరో ఇంటర్వ్యూలో ఫాసీ తెలిపారు. ‘చేతులు కలపడం అనేది అమెరికా కల్చర్‌లో ఓ ముఖ్య భాగం. అయితే అమెరికా అధ్యక్షుడు కూడా ఈ షెక్ హ్యాండ్ల సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెట్టే విషయమై ఆలోచిస్తున్నారు. భవిష్యత్తులో ప్రజలు దీనిపై అంతగా ఆశక్తి చూపకపోవచ్చేమో’ అని కూడా వ్యాఖ్యానించారు.


కాగా.. కరోనాపై అమెరికా చేస్తున్న పోరాటంలో ఆంథోని ఫాసీ కీలక వ్యక్తిగా గుర్తింపొందుతున్న విషయం తెలిసిందే. అమెరికాలోని అలర్జీ, అంటువ్యాధుల పరిశోధన సంస్థకు ఆయన డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఫాసీ ఇచ్చిన సూచనల గురంచి అధ్యక్షుడు ట్రంప్ పలు మార్లు పత్రికా సమావేశాల్లోనూ ప్రస్తావించారు.  


Updated Date - 2020-04-10T01:06:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising