కరోనాతో బాధపడుతున్న అభిమానులకు ఒక్కొక్కరికి రూ.2.2 లక్షలు... ఆ సింగర్ ఔదార్యం
ABN, First Publish Date - 2020-03-27T19:34:14+05:30
తమ అభిమానులు ఏదైనా కష్టంలో ఉంటే సెలబ్రిటీలు వెళ్లి వారిని కలవడం, సాయం చేయడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. ఆ సమయంలో...
తమ అభిమానులు ఏదైనా కష్టంలో ఉంటే సెలబ్రిటీలు వెళ్లి వారిని కలవడం, సాయం చేయడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. ఆ సమయంలో ఆ అభిమానుల సంతోషం అంతాఇంతా కాదు. అయితే ఆ సింగర్ మాత్రం తన ఔదార్యానికి అవధుల్లేవని నిరూపించింది. ఇన్నాళ్లుగా వారు చూపిస్తున్న అభిమానానికి తనవంతు కృతజ్ఞతగా ఓ పెద్ద సాయమే చేసింది.
టేలర్ స్విఫ్ట్.. ఓ ప్రఖ్యాత అమెరికన్ పాప్ సింగర్. ప్రస్తుతం కరోనాతో ప్రపంచం మొత్తం వణికిపోతున్న తరుణంలో ఆమె తన అభిమానులకు అండగా నిలుస్తూ తన గొప్పతనాన్ని చాటుకుంటోంది.
సాధారణంగానే స్విఫ్ట్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఒకరోజు తన టంబ్లర్(అమెరికాలో పాపులర్ సోషల్ మీడియా సైట్) ఖాతా చూస్తుండగా ఒక అభిమాని పెట్టిన పోస్ట్ ఆమెను చాలా బాధకు గురిచేసింది. ‘నా జీవితం చాలా దుర్భరంగా సాగుతోంది. ఇక్కడ జీవించలేకపోతున్నాను. న్యూయార్క్ సిటీని వదిలి వెళ్లిపోవాలనుకుంటున్నాను’ అనేది ఆ పోస్ట్ సారాంశం. ఈ పోస్ట్ చూసిన టేలర్ వెంటనే 3000 డాలర్లు అంటే అక్షరాలా రూ.2.2 లక్షలు ఆ అభిమాని ఖాతాకు పంపించింది.
‘నాకు ఇన్నాళ్లు మీరు అండగా నిలిచారు. ఇప్పుడు మీకు అండగా నేను ఉన్నాను. అధైర్యపడకండి. ఈ డబ్బు మీకు కొంత ఉపయోగపడుతుందనుకుంటున్నాను’ అంటూ రాసుకొచ్చింది. ఊహించని విధంగా తనకు ఇంత మొత్తంలో డబ్బు చేతికందడం, అది కూడా తాను ఎంతగానో ఆరాధించే సెలబ్రిటీ నుంచి ఈ సాయం అందడంతో ఆ అభిమాని ఆనందానికి అవధుల్లేవు. అంతేకాకుండా ఆర్థికంగా కష్టాల్లో ఉన్న మరో అభిమానికి కూడా టేలర్ స్విఫ్ట్ రూ.2.2 లక్షలు అందజేసింది. ఎంత మంచి మనసో కదా టేలర్‌ది.
Updated Date - 2020-03-27T19:34:14+05:30 IST