ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గెలిస్తే భారత్‌కే మద్దతు: జో బిడెన్

ABN, First Publish Date - 2020-08-17T03:28:00+05:30

అమెరికా ఎన్నికల్లో భారతీయ ఓటర్లే కీలకం కానున్న నేపథ్యంలో ఇరు పార్టీలూ తమ ఎత్తులు ప్రారంభించాయి. ఇప్పటికే ట్రంప్ బాహాటంగానే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో భారతీయ ఓటర్లే కీలకం కానున్న నేపథ్యంలో ఇరు పార్టీలూ తమ ఎత్తులు ప్రారంభించాయి. ఇప్పటికే ట్రంప్ బాహాటంగానే భారత్ మద్దతు తెలుపుతుంటే ఇప్పుడు డెమోక్రాట్ ప్రెసిడెంట్ అభ్యర్థి బిడెన్ కూడా అదే దారిలో నడుస్తున్నారు. భారత్‌పై, భారత ప్రజలపై ఎనలేని ప్రేమ కనబరుస్తున్నారు. అందులో భాగంగానే కాలిఫోర్నియా మాజీ సెనేటర్ అయిన భారత సంతతి మహిళ కమలా హ్యారిస్‌ను వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. ప్రతి సమావేశంలోనూ తన మద్దతు భారత్‌కేనంటూ ఊదరగొడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన భారత్‌ గురించి మాట్లాడారు. అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే భారత్‌కు ఎంతో అండగా ఉంటానని అన్నారు.


‘భారత్ ప్రస్తుతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆ సమస్యల పరిష్కారంలో పూర్తి స్థాయిలో మద్దతునిస్తాను. భారతీయులకు అమెరికాలో ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాను. దీనివల్ల ఇరు దేశాల మధ్య స్నేహభావం మరింత పెరుగుతుంది. నేను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం ఇందులో ఎటువంటి మార్పూ ఉండదం’టూ బిడెన్ పేర్కొన్నారు.

Updated Date - 2020-08-17T03:28:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising