ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా కమ్యూనిస్టు పార్టీ పాలన అనుసరణీయం కాదు : అమెరికా దౌత్యవేత్త

ABN, First Publish Date - 2020-08-08T23:52:18+05:30

చైనా కమ్యూనిస్టు పార్టీ పరిపాలనపై అమెరికా ఘాటుగా విమర్శలు గుప్పించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ : చైనా కమ్యూనిస్టు పార్టీ పరిపాలనపై అమెరికా ఘాటుగా విమర్శలు గుప్పించింది. ఆ పార్టీ పాలనను చట్టబద్ధమైన, అనుసరణీయమైన పాలనగా గుర్తించబోమని తెలిపింది. ప్రపంచం అనుకరించేందుకు తగిన పాలనా విధానం తమదేనని చైనా చెప్పుకోవడాన్ని ఖండించింది. మత స్వేచ్ఛ లేకపోవడంపై మండిపడింది. 


అంతర్జాతీయ మత స్వేచ్ఛపై స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక ప్రతినిథి, రాయబారి శామ్ బ్రౌన్‌బాక్ మాట్లాడుతూ, మిగతా ప్రపంచం అనుకరించదగిన, ఆమోదయోగ్యమైన పరిపాలనా విధానం తమకు ఉన్నట్లు చైనా కమ్యూనిస్టు పార్టీ చెప్తోందన్నారు. వాళ్లకి అలాంటి పరిపాలనా వ్యవస్థ లేదని తాము కచ్చితంగా చెప్తున్నామన్నారు. మత స్వేచ్ఛ అనేది ప్రాథమిక మానవ హక్కు అని, అమెరికా ఏర్పాటుకు ఇదే పునాది అని చెప్పారు. ఈ హక్కును చైనా నాశనం చేస్తోందని మండిపడ్డారు. మత విశ్వాసాలతో కమ్యూనిస్టు మార్గంలో యుద్ధం చేస్తున్నారని, తమకు చైనా ప్రజలతో సమస్య లేదని, కేవలం కమ్యూనిస్టు పార్టీ, దాని నాస్తికవాద నియంత్రణతోనే సమస్య అని తెలిపారు. జీ జిన్‌పింగ్ 2013లో అధికారం చేపట్టడానికి పూర్వం చైనా ప్రజలు మత స్వేచ్ఛను ఆస్వాదించారని చెప్పారు. 


అమెరికా, చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో శామ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కోవిడ్-19 మహమ్మారి, చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన వంటి అంశాలపై చైనాను అమెరికా దుయ్యబడుతోంది. 


అమెరికా ఆరోపణలపై చైనా ఘాటుగా స్పందించింది. వీఘర్ ముస్లింలపై తాము ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడటం లేదని తెలిపింది. జింజియాంగ్‌లో ఉగ్రవాద ముప్పును నివారించేందుకు అవసరమైన చర్యలు మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిపింది. 


ఇదిలావుండగా,  చైనా కమ్యూనిస్టు పార్టీ ‘‘పెయిర్ అప్ అండ్ బికమ్ ఫ్యామిలీ’’ పేరుతో అమలు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా స్థానిక చైనీస్ పురుషులను వీఘర్ మహిళల ఇళ్లలో ఉంచుతున్నారని వీఘర్ ఉద్యమకారులు ఆరోపించారు. ఇది సామూహిక అత్యాచారంతో సమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మతపరమైన విశ్వాసాలను గార్డులు ఎగతాళి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


Updated Date - 2020-08-08T23:52:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising