ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరసనలతో అట్టుడుకుతున్న అమెరికా! ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ

ABN, First Publish Date - 2020-05-31T17:38:17+05:30

పోలిసు కర్కశత్వానికి నల్లజాతి పౌరుడు బలవడంతో అమెరికా నిరసనలతో అట్టుడుకుతోంది. జాతి వివక్షతకు వ్యతిరేకంగా అమెరికా పౌరులు రోడెక్కారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: పోలిసు కర్కశత్వానికి నల్లజాతి పౌరుడు బలవడంతో అమెరికా నిరసనలతో అట్టుడుకుతోంది. జాతి వివక్షతకు వ్యతిరేకంగా అమెరికా పౌరులు రోడెక్కారు. అనేక చోట్ల ఈ నిరసనలు హింసాత్మక రూపం దాలుస్తుండటంతో పెద్ద సంఖ్యలో పోలీసులు రంగంలోకి దిగారు.


పలు ప్రాంతాల్లో పోలీసులకు నిరసన కారులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. అమెరికా ప్రధాన నగరాలన్నీ నిరసనల హోరులో దద్దరిల్లుతున్నాయి. ఇటువంటి ఘటనలను ఉక్కుపాదంతో అణచివేస్తామని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించినా నిరసనకారులు వెనక్కు తగ్గడం లేదు.


జాత్యహంకార నిరసనలకు కేంద్రమైన మిన్యాపొలిస్‌లో ఐదో రోజూ వరుసగా నిరసన కారులు పోలీసులు మధ్య ఘర్షణలు చెలరేగాయి. భాష్ఫవాయువు, స్టన్ గ్రెనేడ్లతో పోలీసులు వారిపై విరుచుపడ్డారు. లాస్ యాంజిలిస్, చికాగో, అట్లాంటా వంటి డజనకు పైగా నగరాల్లో కర్ఫ్యూ వాతావరణ నెలకొంది. ప్రజలు ఇళ్లకే పరిమితవవ్వాంటూ రాత్రికి రాత్రి స్థానిక అధికారులు ఆదేశాలు జారీ చేశారు.


నేషనల్ గార్డ్స్(కేంద్ర బలగాలు) రంగంలోకి దింపాలని కూడా కొన్ని రాష్ట్రాలు ట్రంప్ ప్రభుత్వాన్ని కోరాయి. సియాటెల్ నుంచి న్యూయార్క్ వరకూ వేల మంది నిరసన కారులు వీధుల్లో కదనుతొక్కారు. నల్లజాతి వ్యక్తి జార్జి ఫ్లాయిడ్ మృతికి కారణమైన వారి హత్యా నేరం మోపాలంటూ డిమాండ్ చేశారు.


అయితే ఈ నిరసనల వెనకు లెఫ్ట్ భావజాలం హస్తం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘కొన్ని నేరస్తుల బృందాలకు అల్లకల్లోం సృష్టించి, సమాజాన్ని నాశనం చేసే అవకాశం ఇవ్వద్దు’ అని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పిలుపు నిచ్చారు. ఈ మూక హింసకు తన ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా అణచివేస్తుందని స్పష్టం చేశారు. అంతీఫా అనే లెఫ్ట్ వింగ్ ఉద్యమం ఈ హింసాత్మక ఘటనలకు కారణమని అధ్యక్షుడు ఆరోపించారు. 

Updated Date - 2020-05-31T17:38:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising