ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనాపై అమెరికా సంఘటిత పోరు

ABN, First Publish Date - 2020-04-26T07:07:37+05:30

కరోనా వైర్‌సపై ప్రపంచ దేశాలకు వాస్తవాలను వెల్లడించి, చైనాను బోనులో నిలబెట్టేలా వాటిని కలుపుకెళతామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. వూహాన్‌లోనే తొలుత కరోనా జనించిందనేది సుస్పష్టమని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 25: కరోనా వైర్‌సపై ప్రపంచ దేశాలకు వాస్తవాలను వెల్లడించి, చైనాను బోనులో నిలబెట్టేలా వాటిని కలుపుకెళతామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. వూహాన్‌లోనే తొలుత కరోనా జనించిందనేది సుస్పష్టమని, అది ఎలా మొదలయిందనేది చెప్పాల్సిన బాధ్యత చైనా ప్రభుత్వంపైనే ఉన్నదని రక్షణ మంత్రి మైక్‌ పాంపియో డిమాండ్‌ చేశారు. కరోనా విషయం గత ఏడాది డిసెంబరులోనే తెలిసినా, కనీసం ఒక దేశం వ్యవహరించాల్సిన పద్ధతుల్లోనూ చైనా నడుచుకోలేదని ఓ చానల్‌ ఇంటర్వ్యూలో ఆయన ధ్వజమెత్తారు.


అపారంగా అమెరికా చవిచూసిన ప్రాణ, ఆర్థిక నష్టాలకు కారణమయిన వారు తప్పక ఈ నష్టాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ‘ఈ విపత్కాలంగా సరైన చర్యలు తీసుకోవడంలో దౌత్యపరంగా తక్కినదేశాలకు అమెరికా సహకరిస్తుంది. వాటి ఆర్థికవ్యవస్థలు తిరిగి పుంజుకొనేందుకు చేయూతనందిస్తుంది’’ అని వివరించారు. వైరస్‌ నుంచి ప్రపంచాన్ని రక్షించడం లో డబ్ల్యూహెచ్‌వో విఫలమయిందని పాంపియో మండిపడ్డారు. 


Updated Date - 2020-04-26T07:07:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising