ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈసారి అమ‌ర్‌నాథ్ యాత్ర ఎలా జ‌ర‌గ‌బోతోందంటే...

ABN, First Publish Date - 2020-07-01T13:34:20+05:30

ఈసారి అమర్‌నాథ్ యాత్రలో భక్తులు కాలిన‌డ‌క‌న కాకుండా, హెలికాప్టర్‌లో గుహ వ‌ర‌కూ వెళ్లాల్సివుంటుంది. ఈ యాత్రసాగించే ప్రతి భక్తునికి ముందుగా కరోనా పరీక్షలు చేయ‌నున్నారు. ఇదిపూర్త‌య్యాకే వారిని యాత్ర‌కు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: ఈసారి అమర్‌నాథ్ యాత్రలో భక్తులు కాలిన‌డ‌క‌న కాకుండా, హెలికాప్టర్‌లో గుహ వ‌ర‌కూ వెళ్లాల్సివుంటుంది. ఈ యాత్రసాగించే ప్రతి భక్తునికి ముందుగా కరోనా పరీక్షలు చేయ‌నున్నారు. ఇదిపూర్త‌య్యాకే వారిని యాత్ర‌కు అనుమ‌తిస్తారు. ఇందుకోసం జమ్మూలోని లఖన్‌పూర్ లేదా భగవతినగర్‌లో ఒక వైద్య‌పరీక్ష‌ల కేంద్రం ఏర్పాటు చేయ‌నున్నారు. దీనికి సంబంధించిన ప్ర‌ణాళిక‌ను పూర్తిచేసిన‌ప్ప‌టికీ, ఇంకా ప్రకటించవలసి ఉంది. జూలై రెండవ వారంలో ఆల‌య‌ బోర్డు సమావేశం జ‌ర‌గ‌నుంది. అప్పుడు భ‌క్తుల ప్రయాణంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. మీడియాకు అందిన స‌మాచారం ప్ర‌కారం దేశంలో క‌రోనా వ్యాప్తి చెందుతున్న త‌రుణంలో అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు సం‌బంధించి పలు చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల‌ జ‌మ్ముక‌శ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ ముర్ము సమావేశం నిర్వహించారు. ఈ స‌మావేశానికి వివిధ విభాగాల‌కు చెందిన ఉన్న‌తాధికారులు హాజరయ్యారు. కాగా ఈ యాత్ర కొద్ది రోజులు మాత్రమే జర‌గ‌నున్న‌ద‌ని తెలుస్తోంది. మ‌రోవైపు జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్‌ను కోవిడ్ ఆసుపత్రిగా మార్చారు. 

Updated Date - 2020-07-01T13:34:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising