ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమిత్ షాతో పంజాబ్ సీఎం భేటీ

ABN, First Publish Date - 2020-12-04T05:05:00+05:30

పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. నూతన వ్యవసాయ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. నూతన వ్యవసాయ చట్టాలపై రైతులు చేపట్టిన ఆందోళనకు త్వరితగతిన పరిష్కారం చూపించాలంటూ ఆయన కోరారు. ఈ ఆందోళన కారణంగా పంజాబ్ ఆర్థిక వ్యవస్థకు నష్టం చేకూరడంతో పాటు, జాతీయ భద్రతపైనా ప్రభావం చూపించే అవకాశం ఉందంటూ సీఎం వివరించారు. అమిత్ షా నివాసంలో గురువారం జరిగిన ఈ భేటీ అనంతరం సింగ్ స్పందిస్తూ.. ‘‘వ్యవసాయ చట్టాలపై పంజాబ్ ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా తెలియజేశాను. రైతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోారాను. వీలైనంత త్వరగా ఈ సమస్య పరిష్కారం కావాల్సి ఉన్నందున అటు కేంద్రం, ఇటు రైతులు పంతాలకు పోకుండా అందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని కోరాను..’’ ముఖ్యమంత్రి వెల్లడించారు. కాగా రైతులు, కేంద్ర ప్రభుత్వం నడుమ మధ్యవర్తిత్వం వహిస్తారా అన్న ప్రశ్నకు సింగ్ స్పందిస్తూ... ఇప్పటికే ఇరు పక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయనీ, ఈ దశలో తాను జోక్యం చేసుకోదల్చుకోలేదని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-12-04T05:05:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising