అది తప్ప అన్నీ ఓకే: కేంద్రం సడలింపులపై గోవా సీఎం
ABN, First Publish Date - 2020-06-01T21:09:15+05:30
నాలుగో దశ లాక్‌డౌన్ మరో రోజుతో ముగిసిపోతున్న తరుణంలో శనివారం కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్-1 పేరుతో భారీ సడలింపులను ప్రకటించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, అన్ని మతాల ప్రార్థనా మందిరాలు, షాపింగ్ మాల్స్ తెరిచి ప్రజలను
పనాజీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మినహాయింపులనే తామూ కొనసాగిస్తామని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు. అయితే అంతరాష్ట్ర రవాణాను తాము ఇప్పుడే అంగీకరించబోమని ఆయన పేర్కొన్నారు. ఈ ఒక్క విషయం మినహా కేంద్ర ఇచ్చిన అన్ని మినహాయింపులను రాష్ట్రంలో అమలు పరుస్తామని ఆయన అన్నారు. మంగళవారం నిర్వహించిన కేబినేట్ సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నాలుగో దశ లాక్‌డౌన్ మరో రోజుతో ముగిసిపోతున్న తరుణంలో శనివారం కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్-1 పేరుతో భారీ సడలింపులను ప్రకటించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, అన్ని మతాల ప్రార్థనా మందిరాలు, షాపింగ్ మాల్స్ తెరిచి ప్రజలను అనుమతించొచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇక రాత్రి కర్ఫ్యేని రెండు గంటలకు తగ్గించింది. ఇప్పటి వరకు రాత్రి 7 నుంచి ఉన్న కర్ఫ్యూ ఇక నుంచి రాత్రి 9 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఇక అంతరాష్ట్ర రవాణాకు కూడా అనుమతిచ్చింది. అయితే రాష్ట్రాల మధ్య ప్రజలు తిరగడానికి ఎలాంటి ఈ-పాస్‌లు అక్కర్లేదని స్పష్టం చేసింది.
Updated Date - 2020-06-01T21:09:15+05:30 IST