ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క‌రోనాకు వేపమందు... హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్ షురూ!

ABN, First Publish Date - 2020-08-20T14:37:18+05:30

కరోనాకు చెక్ పెట్టేందుకు వైద్యులు, పరిశోధకులు ప‌గ‌ల‌న‌క‌రాత్ర‌న‌క త‌మ ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నారు. ఈ ప్రక్రియలో ఆయుర్వేదవైద్యం కూడా త‌న ఉనికిని చాటుకుంటోంది. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనాకు చెక్ పెట్టేందుకు వైద్యులు, పరిశోధకులు ప‌గ‌ల‌న‌క‌రాత్ర‌న‌క త‌మ ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నారు. ఈ ప్రక్రియలో ఆయుర్వేదవైద్యం కూడా త‌న ఉనికిని చాటుకుంటోంది. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద్‌(ఏఐఐఏ) తాజాగా నిసార్గ్ హెర్బ్స్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. కరోనాతో పోరాడడంలో వేప ఎంత ప్రభావవంతంగా ఉంటుంద‌నేది తెలు‌సుకునేందుకు ఈ రెండు సంస్థలు క‌లిసి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నాయి. హ‌ర్యానాలోని ఫరీదాబాద్‌లోని ఈఎస్‌ఐసీ ఆసుపత్రిలో ఈ పరీక్షలు జ‌రుగుతున్నాయి. ఏఐఐఏ డైరెక్టర్ డాక్టర్ తనూజా నేసారి ఈ పరిశోధనల‌కు సార‌ధ్యం వ‌హిస్తున్నారు. ఆయనకు ఈఎస్‌ఐసీ హాస్పిటల్ డీన్ డాక్టర్ అసీమ్ సేన్‌తోపాటు మ‌రో ఆరుగురు వైద్యుల బృందం స‌హ‌క‌రిస్తోంది. ఈ బృందం 250 మందిపై వేపమందు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తోంది. కరోనా వైరస్ సంక్రమణను నివారించడంలో వేప‌మందు ఎంత ప్రభావవంతంగా ఉంటుందో వీరు తెలుసుకోనున్నారు. ఈ ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభ‌మ‌య్యింది. ముందుగా 125 మందికి వేప గుళికలు ఇచ్చి, అవి క‌రోనాపై పోరాడంలో ఎంత‌వ‌ర‌కూ ప్ర‌భావ‌వం‌తంగా ఉంటాయో ప‌రిశీలించ‌నున్నారు. ఈ ప్రక్రియ 28 రోజుల‌పాటు జ‌ర‌గ‌నుంది. కాగా కరోనా నివారణలో తమ వేప‌మందు సమర్థవంతమైన యాంటీ-వైరల్ ఔష‌ధంగా నిలుస్తుందని నమ్ముతున్నామ‌ని నిసార్గ్ బయోటెక్ వ్యవస్థాపకుడు, సీఈవో గిరీష్ సోమన్ తెలిపారు. 

Updated Date - 2020-08-20T14:37:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising