దేశీయ, ప్రైవేట్ విమానాలపై నిషేధాన్ని పొడగించిన కేంద్రం
ABN, First Publish Date - 2020-03-27T22:33:18+05:30
దేశీయ, ప్రైవేట్, షెడ్యూల్ లేని విమానాల నిషేధాన్ని పొడగిస్తున్నట్లు విమానయాన శాఖ శుక్రవారం ప్రకటించింది
న్యూఢిల్లీ : దేశీయ, ప్రైవేట్, షెడ్యూల్ లేని విమానాల నిషేధాన్ని పొడగిస్తున్నట్లు విమానయాన శాఖ శుక్రవారం ప్రకటించింది. కోవిడ్ నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకు నిషేధాన్ని పొడగిస్తున్నట్లు శాఖ తెలిపింది. ‘‘అన్నిఅంతర్జాతీయ విమానాలపై ఏప్రిల్ 14 వరకు నిషేధిస్తున్నాం. డీజీసీఏ నుంచి ప్రత్యేక అనుమతి పొందిన, అంతర్జాతీయ కార్గో విమానాలను మాత్రం ఇందుకు మినహాయింపు’’ అని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు అంతర్జాతీయ విమానాలపై కూడా ఏప్రిల్ 14 వరకు నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే.
Updated Date - 2020-03-27T22:33:18+05:30 IST