ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీజీ..నిబంధనలను సడలించండి: అఖిలేష్

ABN, First Publish Date - 2020-03-23T16:36:58+05:30

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్ను రిటర్న్‌ల దాఖలకు గడువు పెంచుతూ పన్ను చెల్లింపుదారులకు వెసులుబాటు కల్పించాలని ప్రధాని మోదీకి సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్ను రిటర్న్‌ల దాఖలకు గడువు పెంచుతూ పన్ను చెల్లింపుదారులకు వెసులుబాటు కల్పించాలని ప్రధాని మోదీకి సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌ మహమ్మారితో యావద్దేశం పారాడుతున్న నేపథ్యంలో పన్ను రిటర్న్‌ల దాఖలకు నిబంధనలను సడలించాలని కోరారు.


'దేశంలోని వ్యాపారులు, వేతన ఉద్యోగులు, చార్టెర్డ్ అకౌంటెంట్లకు ఆర్థిక సంవత్సరం చివరి వారం పెనుభారం పడుతుంది. అందులోనూ ఇప్పుడు కరోనా వైరస్‌పై యావద్దేశం పోరాడుతున్న తరుణం కావడంతో ఆ ఒత్తిడి వారిపై మరింత ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అదనపు జరిమానాలు, చార్జీలు లేకుండా ప్రభుత్వం తక్షణం ఉపశమన చర్యలు  ప్రకటించాలి. అందువల్ల ప్రభుత్వం ఏమి చేస్తుందోనన్న భయాందోళనల నుంచి పన్నుచెల్లింపుదారులకు ఉపశమనం కలుగుతుంది' అని అఖిలేష్ ఓ  ట్వీట్‌లో ప్రధానిని కోరారు. కాగా, 2019-20 ఆర్థిక సంవత్సరం ఈనెల 31తో ముగియనుంది. దేశంలో కరోనా సంక్షోణం కొనసాగుతుండటంతో వ్యాపారాలు, వాణిజ్య కార్యకలాపాలపై ఆ ప్రభావం గణనీయంగా కనిపిస్తోంది.

Updated Date - 2020-03-23T16:36:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising