ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యోగి సర్కారు నిర్ణయంపై అఖిలేష్ సెటైర్లు

ABN, First Publish Date - 2020-05-24T20:59:35+05:30

లక్నో: కరోనా వ్యాప్తి నేపథ్యంలో యూపీ సర్కారు మరో నిర్ణయం తీసుకుంది. ఐసొలేషన్ వార్డుల్లోకి పేషంట్లు మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: కరోనా వ్యాప్తి నేపథ్యంలో యూపీ సర్కారు మరో నిర్ణయం తీసుకుంది. ఐసొలేషన్ వార్డుల్లోకి పేషంట్లు మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ ఆసుపత్రుల్లో చేరే పేషంట్లు ఇకపై వార్డుల్లోకి వెళ్లక ముందే మొబైల్ ఫోన్లను వార్డు ఇంఛార్జికి అప్పగించాల్సి ఉంటుంది. డిశ్చార్జ్ సమయంలో ఫోన్లను తిరిగి అప్పగిస్తారు. మొబైల్ ఫోన్ల ద్వారా ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ఆదేశాల్లో ఉంది. 


మరోవైపు యోగి సర్కారు నిర్ణయంపై మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సెటైర్లు వేశారు. ఆసుపత్రుల్లో మొబైల్ ఫోన్లను బ్యాన్ చేయడం వల్ల ప్రయోజనం లేదని చెప్పారు. వాస్తవానికి చేయాల్సింది శానిటేషన్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. వైఫల్యాలు బయటపడతాయనే భయంతోటే సర్కారు మొబైల్ ఫోన్లను నిషేధించిందని అఖిలేష్ ఆరోపించారు. 




పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఆరంభం నుంచే కోవిడ్ వార్డుల్లోకి మోబైల్ ఫోన్లను అనుమతించడం లేదు. 

Updated Date - 2020-05-24T20:59:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising